లాక్ డౌన్ కారణంగా ఇళ్లలో ఉంటూ ఏం చేయాలో పాలుపోక కొంతమంది చేసే ప్రవర్తన నెటిజెన్స్ కి నవ్వు తెప్పిస్తుంది. కానీ రక్షణ సిబ్బంది కి మాత్రం భయపెట్టిస్తోంది.  ప్రపంచంలో అందరూ లాక్ డౌన్  కారణంగా ఇళ్లకే పరిమితమవుతున్నారు కొంతమంది ఆకతాయిలు ఏదో ఒక వంక పెట్టుకుని బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని దేశాల మాదిరిగానే స్పెయిన్ లో కూడా లాక్ డౌన్  పొడిగించడం తో చేసేది ఏమీ లేక ప్రజలంతా ఇళ్లలోనే ఉంటూ ప్రభుత్వానికి సహాయపడుతున్నారు. అయితే ఇటీవల   స్పెయిన్  లో పెంపుడు జంతువులను బయటకు తీసుకెళ్ళటానికి ఉపశమనం కలిగించింది స్పెయిన్ ప్రభుత్వం. ఈ పాయింట్ ను బేస్ చేసుకుని కొంతమంది ఆకతాయిలు చేపలు ఉన్న ఫిషింగ్  బౌల్ ను తీసుకొని వాకింగ్ కి వచ్చారు.

IHG

 

ఇకపోతే మరొకరు కోడి  కీ తాడు కట్టి దానిని తీసుకొచ్చాడు. అయితే వీటికి సంబంధించిన వీడియో ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరికొందరు కుక్క బొమ్మలు కూడా వాకింగ్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారట. వీటన్నిటిని చూసిన స్పెయిన్ పోలీసులు తలలు పట్టుకుని కూర్చున్నారట. పనిలో పనిగా వారిపై కేసులు కూడా నమోదు చేస్తున్నారట. ఇలా పెట్స్ తో బయటకు రావచ్చనే వంకతో కోళ్లు, చేపలు తొట్టె వంటి వాటిని బయటకు తీసుకుని వస్తూ ఉన్నారు. దీనితో పోలీసులు తలలు పట్టుకుని కూర్చున్నారు. నేషనల్ పోలీసులు ఫోటోను ట్వీట్ చేశారు.

IHG

 

 

లోగ్రాన్ లో  పట్టణానికి చెందిన ఓ వ్యక్తి చేపలు ఉండే ఫిషింగ్ బౌల్ ని  తీసుకొని వాకింగ్ మొదలు పెట్టాడట. దీంతో పోలీసులు అతడిని జరిమానా కూడా విధించారు. దీంతో స్పెయిన్ కు  చెందిన సివిల్ గాడ్స్ కూడా ట్వీట్ చేశారు అందులో ఓ వ్యక్తి కోడి కి తాడు కట్టి  వాకింగ్ చేస్తున్నాడు. మరో వ్యక్తి కుక్క బొమ్మలు రోడ్డుపై నడిపిస్తూ పోలీసులను మోసం చేసే ప్రయత్నం చేశాడు ఆ వీడియోలను ఈ కింది ట్వీట్ ద్వారా చూడవచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: