లోకంలో మనిషి తనకు పుట్టుకతో ప్రాప్తించిన లక్షణాలను వదిలి, తనివి కానీ అవలక్షణాలను మనసుకు అంటించు కుంటున్నాడు.. కానీ జంతువులు అలా కాదు.. అవి ఏ జీవి కడుపున పుట్టాయో వాటికున్న అవే లక్షణాలను తాము మరణించే వరకు పాటిస్తున్నాయి.. అసలు మన పూర్వికులు మనకు నేర్పిన సంస్కారాలు ఇవి కావు.. మధ్యలో వచ్చిన వాటిని పట్టుకుని ఇదే మన జీవితం అని గర్విస్తున్నాం..

 

 

ఈ సృష్టిలో అతిగా మార్పు చెందిన ప్రాణి ఏదైనా ఉందంటే అది ఒక్క మనిషి మాత్రమే.. ఇకపోతే కరోనా సమయంలో విధించిన లాక్‌డౌన్ నేపధ్యంలో ప్రతి వారికి కావలసినంత సమయం దొరికింది.. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో క్షణం కూడా తీరిక లేకుండా గడిపిన ప్రతివారు ఇప్పుడు తీరిగ్గా కాలక్షేపం చేస్తున్నారు.. అందువల్ల సోషల్ మీడియా ఉపయోగం విపరీతంగా పెరిగిపోయింది.. ఏది షేర్ చేసిన క్షణాల్లో వైరల్‌గా మారిపోతుంది.. ఇకపోతే తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో జనాలను విశేషంగా ఆకట్టుకుంది.

 

 

ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ తర్వాత వన్య ప్రాణులకూ సంబంధించిన ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.. ఇదే కోవలో వెల్ కం టూ నేచర్ అనే ఖాతా ద్వారా ట్విట్టర్ లో షేర్ చేసిన ఒక సింహం పిల్లకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.. టాంజానియాలోని సెరెంగేటి నేషనల్ పార్క్‌లో తిరుగుతున్న ఒక చిన్న సింహం పిల్ల తనకు వంశపార్యపరంగా లభిస్తున్న దర్పాన్ని గంభీరంగా ప్రదర్శించే క్రమంలో తన తల్లిలా గర్జించడం చూస్తుంటే ఎంతైనా సింహం పిల్ల సింహం పిల్లనే అనుకోక తప్పదు.. కాగా దీనికి మా అంటే రోజుల వయస్సు మాత్రమే ఉండవచ్చని అంటున్నారు..

 

 

ఇక “సెరెంగేటి నేషనల్ పార్క్ లోని ఓ చిన్న సింహం పిల్ల” అనే శీర్షికతో దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇప్పటివరకు దాదాపుగా 60,000 వేల మంది పైగా వీక్షించారట.. కాగా లాక్ డౌన్ సమయంలో ఎక్కువగా వన్య ప్రాణులు జనాల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే.. అవి కూడా స్వేచ్చను కోరుకుంటున్నాయి.. కానీ మానవుడు ఎప్పుడో వాటి స్వేచ్చను హరించాడని తెలియదు కదా..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: