ఈ ప్రపంచంలో రకరకాల మనస్తత్వాలు గల మనుషులు బ్రతుకుతూ వుంటారు. కొంతమంది మనుషులు ఎలా ఉంటారంటే తమ పని కన్న పక్కనోళ్ళ పనుల మీద ఎక్కువ ఆసక్తి కనబరుస్తుంటారు. తాము బాగు పడకపోయినా పర్వాలేదు కాని వేరే వాళ్ళు బాగు పడకూడదు. వాళ్లకి మనశ్శాంతి లేకుండా చెయ్యాలి అనే స్వభావం కలిగి వుంటారు. అలాంటి స్వభావం గల ఒక వ్యక్తి వేరే  యువకుడి మీద కోపంతో పాపం అతనికి వచ్చే పెళ్లి సంబంధాలు అన్ని చెడగొట్టేవాడట. దాంతో విసిగిపోయిన ఆ యువకుడు ఆ వ్యక్తి పై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ వైరల్ న్యూస్ చదవండి..

కేరళకు చెందిన కన్నూరు జిల్లా వాసి అల్బిన్‌ మాథ్యూ (30) పెళ్లికి సిద్ధమవుతుండేవాడు. కాని అతనికి పెళ్లి కాకుండా ఓ వ్యక్తి పనిగట్టుకుని మరి అతడి ఇంటికి వచ్చే పెళ్లి సంబంధాలను చెడగొడుతుండేవాడట. ఇంట్లోవాళ్లు ఎన్ని సంబంధాలు చూసినా.. ఒక్కటి కూడా ముందుకెళ్లేది కాదు. దీనికి కారణం.. అల్బిన్ ఇంటి ముందు ఆ వ్యక్తే అని తెలుసుకున్నాడు. అక్కడ ఆ వ్యక్తి దుకాణం వుండేదట.  స్థానికులు నిత్యం అక్కడ జూదం ఆడతారు. మద్యం తాగుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. దీంతో అల్బీన్ కుటుంబికులు ఎప్పటి నుంచో ఆ దుకాణంపై అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ, పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఆ దుకాణ యజమానికి, అల్బీన్‌కు మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో ఆ దుకాణ యజమాని అల్బిన్‌‌కు వచ్చే పెళ్లి సంబంధాలను చెడగొట్టడం మొదలుపెట్టాడు. దీంతో అల్బిన్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

జేసీబీతో ఆ దుకాణాన్ని కూల్చిపడేసి అతడిపై ప్రతీకారం తీర్చుకున్నాడు. మలయాళ చిత్రం ‘అయ్యప్పనం కోశియం’ సినిమా పాటను పెట్టి.. ఆ సినిమాలోని రియల్ లైఫ్ సీన్ అంటూ వీడియోను ‘యూట్యూబ్’లో పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది. దీనిపై షాపు యజమాని స్పందిస్తూ.. అతడి ఆరోపణల్లో నిజం లేదని, వ్యక్తిగత కక్షతోనే అల్బిన్ తన దుకాణాన్ని కూల్చేశాడని తెలిపాడు. ఇలాంటి మరిన్ని వైరల్ వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..



మరింత సమాచారం తెలుసుకోండి: