ఇక అసలు విషయానికి వస్తే ఈజిప్షియన్ మోడల్ సల్మా అల్-షిమికి కైరోలో గల పిరమిడ్ ఆఫ్ జొజర్ వద్ద అలనాటి ప్రాచీన సంప్రదాయ బట్టలతో ఫొటోలు, వీడియోలు తీయించుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అవి కాస్త వైరల్‌గా మారాయి. దీంతో పోలీసులు షిమితోపాటు ఫొటోగ్రాఫర్‌ను కూడా అరెస్ట్ చెయ్యడం జరిగింది. సక్కారా నెక్రోపోలిస్ వద్ద గల ఆర్కియలాజికల్ జోన్‌లో అనుమతి లేకుండా ఫొటోషూట్ చేశారని, యాంటిక్విటీస్ మినిస్ట్రీ నిబంధనలకు ఇది విరుద్ధమని పోలీసులు ముందుగానే వెల్లడించారట . అయితే, ఈ ఫొటోలపై ప్రభుత్వ చెబుతున్న కారణాలేవీ స్పష్టంగా లేకపోవడంతో నెటిజనులు విమర్శలు చేస్తున్నారు.



సిమికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే చాలా మంది ఫాలోవర్లు వున్నారు.. ఆ బట్టల తో ఈజిప్ట్ ప్రాచీన వారసత్వ సంపదను అవమానించిందంటూ కొందరు నెటిజనులు విమర్శిస్తే, మరి కొందరు మాత్రం.. అందులో తప్పు ఏముందని ప్రశ్నించారు. ప్రపంచ వింతల్లో ఒకటైన పిరమిడ్ల వద్ద ఫొటోలు తీసుకోవడం తప్పేంటని అని పలువరు ప్రశ్నిస్తున్నారు. పైగా, ఆమె వేసుకున్న దుస్తుల్లో అశ్లీలత ఏముందో చెప్పాలని అంటున్నారు. దీనిపై మోడల్ షిమీ ఇంకా స్పందించలేదు. అయితే, 2018లో ఓ జంట ఏకంగా పిరమిడ్ల పైకి చేరుకుని దుస్తులు లేకుండా ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఈ ఘటన కూడా అప్పట్లో సంచలనం సృష్టించింది.దాంతో పోల్చుకుంటే ఇది పెద్ద తప్పేమి కాదని పలువురు నెటిజనులు విమర్శిస్తున్నారు.ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి....
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి