ఒక వ్యక్తికి విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయునికి ఈనాడు సొంత ఇల్లు కూడా లేని పరిస్థితి ఉందంటే అర్ధం చేసుకోండి. చాలీ చాలని జీతాలతో ఇల్లు గడవ లేని పరిస్థితి ఉపాధ్యాయునిది.సమాజానికి ఒక ఇంజనీర్ కావాలన్న, డాక్టర్ కావాలన్న, పోలీస్ కావాలన్న ఖచ్చితంగా వారి వెనకాల ఉపాధ్యాయుడు వుండాల్సిందే.గుర్తించకపోయినా పర్లేదు కాని వాళ్ళు పడ్డ కష్టానికి ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది నేటి సమాజంలో. ఎంతోమంది చదువుకొని ఎన్నో కోట్లు సంపాదిస్తున్నారు.
కాని ఆ చదువు నేర్పిన ఉపాధ్యాయుడు మాత్రం పేదవాడిగానే మిగిలిపోతున్నాడు.ఉపాధ్యాయుడు లేకపోతే గొప్ప గొప్పోళ్ళు ఉండరు.వారి అక్కర్లు, అవసరాలు తీర్చాలి. అంతెందుకు మనం ఇప్పుడు ప్రశాంతంగా బ్రతుకుతున్నామంటే దాని వెనకాల ఉపాధ్యాయుని హస్తం వుంది. మాతృదేవో భవ, పితృ దేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు పెద్దలు. అమ్మ నాన్న తరువాత ఒక మనిషి జీవితంలో ముందడుగు వేసేటందుకు సహాయపడే వ్యక్తి ఉపాధ్యాయుడు.
ఒక మనిషికి విద్యా బుద్ధులు నేర్పి ఆ మనిషిని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లే వ్యక్తే ఉపాధ్యాయుడు. ఎందుకంటే సమాజంలో ఒక మనిషి ఉన్నత శిఖరాలు అందుకోవాలంటే ఖచ్చితంగా చదువు ఉండాలి. అలాంటి చదువు మనకు ఉపాధ్యాయుని ద్వారానే లభిస్తుంది. కాని అలాంటి ఉపాధ్యాయులను ఈనాడు ఎవరూ గుర్తించట్లేదు.చాలీ చాలని జీతాలతో ఉపాధ్యాయులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని గుర్తించకపోయినా పర్లేదు కాని వారి కష్టాన్ని గుర్తించి వారికి తగిన ప్రతి ఫలం అందేలా ప్రభుత్వం చూడాలి.
వారికి జీతాలు పెంచాలి.ఇక ప్రతి టీచర్ కి ప్రభుత్వం జీవిత భీమా పథకం ప్రవేశ పెట్టాలి. మాములుగా అందరి లాగా కాకుండా టీచర్లకి మాత్రమే ప్రత్యేకంగా భీమా పథకం గవర్నమెంట్ ప్రవేశపెట్టాలి.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి