ఇక మెల్‌బోర్న్ సెక్సువల్ హెల్త్ సెంటర్ 2018 అధ్యయనం ప్రకారం.. ప్రతి ఐదు మంది మగవాళ్ళలో ఒకరు మహిళతో శృంగారం చేసేటప్పుడు మధ్యలో కండోమ్ తొలగిస్తున్నట్లు తేలింది. ఇలా చేయడం పూర్తిగా మహిళల హక్కులకు, గౌరవానికి భంగం కలిగించడమేనని స్టడీ పేర్కొనడం జరిగింది. ఇంతకీ ఏమైందో తెలుసుకోవాలంటే ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ న్యూస్ చదవండి..ఓ జంట శృంగారం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.ఆ వ్యక్తి తన మహిళతో పడకగదిలో ఏకాంతంగా గడిపాడు. ఇద్దరూ బీభత్సంగా శృంగారంలో మునిగితేలారు. అయితే, మధ్యలో ఆమెకు తెలియకుండా కండోమ్ తీసేసి ‘ఆ పని’ కొనసాగించాడు. ఈ విషయం తెలిసి ఆ మహిళ షాకైంది. అంతేకాదు.. అతడిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. దీంతో పోలీసులు అతడిపై రేప్ కేసు నమోదు చేశారు.


ఈ ఘటన న్యూజిలాండ్‌లో చోటుచేసుకుంది.
వాస్తవానికి ఒక జంట పరస్పర అంగీకరంతో రొమాన్స్ చేస్తే తప్పులేదు. అయితే, ఆ సమయంలో మహిళ అనుమతి లేకుండా మధ్యలో కండోమ్ తొలగించి ఆ పని చేస్తే మాత్రం నేరమే. న్యూజిలాండ్‌లో ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తారు. అందుకే, ఆ మహిళ ఫిర్యాదు అందుకోగానే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని రేప్ కేసు పెట్టారు. ఆమె అంగీకరం లేకుండా బలత్కారం చేయడం ఎంత నేరమో.. ఆమె అంగీకరం లేకుండా కండోమ్ తొలగించడం అత్యాచారంతో సమానమని అక్కడి చట్టాలు వెల్లడిస్తున్నాయి.


ఇది వరకు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకొనేవారు కాదు. అయితే, హెచ్‌ఐవీ ఎయిడ్స్, లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్ల తీవ్రత ఎక్కువగా ఉండటంతో కొన్ని దేశాల్లో ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకుంటున్నాయి. ముఖ్యంగా అపరిచిత మహిళలతో ఆ పనిలో పాల్గొనే పురుషులు తప్పకుండా కండోమ్ వినియోగించాలి. ఆ మహిళకు ఎలాంటి అభ్యంతరం లేకపోతేనే కండోమ్ తొలగించి పనిలో పాల్గోవాలి. మధ్యలో దాన్ని తీసేసి మోసం చేస్తే అత్యాచారం కిందే పరిగణిస్తామని న్యూజిలాండ్ అధికారులు హెచ్చరిస్తున్నారు.ఇక ఆ వ్యక్తిపై నమోదు చేసిన రేప్ కేసు విచారణ ఈ నెలలో విచారణకు రానుంది. కోర్టు అతడికి ఎలాంటి శిక్ష విధించనుందనే ఆసక్తి నెలకొంది.ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఇక ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకొండి.

మరింత సమాచారం తెలుసుకోండి: