పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని గ్వాదర్ లో ఓ మత్స్యకారుడిని అదృష్టం తలుపుతట్టింది.గ్వాదార్ తీరానికి చెందిన సాజిద్ హాజీ అబాబాకర్ మత్స్యకారుడు.ఈయన ప్రతిరోజు సముద్రానికి వెళ్లడం చేపలు పట్టడం, వాటిని అమ్మడం చేస్తూ ఉంటాడు.దానినే అబాబాకర్ కుటుంబం జీవనాధారం చేసుకుంది. చేపలు పట్టి అమ్మితేనే అతడి కుటుంబానికి రోజు కడుపు నిండుతుంది. అలాంటిది అబాబాకర్ జీవితం అనుకోకుండా ఒక్కసారిగా మలుపుతిరిగింది. ఒకే ఒక చేపతో ఏకంగా రూ.72 లక్షలు సంపాదించాడు.అబాబాకర్ పట్టింది అలాంటి ఇలాంటి చేప కాదు. అదో అరుదైన అట్లాంటిక్ క్రోకర్ జాతికి చెందినది. 48 కేజీల బరువున్న ఈ చేప వేలంలో ఏకంగా రూ.72 లక్షల ధర పలికింది.యూరప్, చైనాల్లో ఈ క్రోకర్ జాతి చేపలకు ఫుల్ డిమాండ్ ఉంది. చాలా చేపల విలువ వాటి మాంసం ఆధారంగా నిర్ణయమవుతుంది. క్రోకర్ జాతి చేప విషయం వేరు. వైద్యపరంగా ఈ చేపలకు అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉంది. దీని చర్మాన్ని, ఎముకలను ఔషధాల్లో, ఇతర వైద్యపరమైన అంశాల్లో వాడతారు. అందుకే దీనికి అంత ధర.నిజానికి వేలంలో ధర ఇంకా ఎక్కువ పలికింది.దాదాపుగా 80లక్షల వరకు పలకగా..ఇక్కడ రాయితీలో ఆ చేప ఖరీదు తగ్గింది.అధికారులు చివరికి రూ.72 లక్షలుగా ధరను ఖరారు చేశారు. గతవారం కూడా గ్వాదర్ తీరంలోనే ఒక మత్స్యకారుడు ఈ క్రోకర్ జాతి చేపను పట్టాడు. వేలంలో అది రూ.7.8 లక్షలకు అమ్ముడైంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి