ఇక కరోనా మహమ్మారి ప్రమాదం మరో 6 నుంచి 8 వారాల్లో పొంచి ఉందని ఎయిమ్స్ చీఫ్ డా. రణదీప్ గులేరియా అంటున్నారు.ఇక గులేరియా మాట్లాడుతూ.. ఇక కొన్ని వారాల తరబడి విధించిన ప్రక్రియను అన్ లాక్ చేయడంతో రాబోయే సమస్యలను గురించి ప్రస్తావించారు. ఇక దేశానికి ఉన్న పెద్ద ఛాలెంజ్ జనాలకు తగ్గట్లుగా వ్యాక్సిన్ డోస్ గ్యాప్ లేకుండా చూసుకోవడమే.ఇది మరింత మందికి వ్యాక్సినేషన్ సకాలంలో సరైన వేళలో వేయగలగాలి. ఇక కొత్త మ్యూటెంట్ వైరస్ డెల్టా ప్లస్ వేరియంట్ గురించి కూడా ఆయన మాట్లాడారు.ఇక ‘అన్ లాకింగ్ స్టార్టింగ్ చేసినప్పటి నుంచి కరోనా మహమ్మారి తీవ్రత మళ్లీ పెరుగుతుంది. అలాగే కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ నుంచి తెలుసుకున్నదేదీ అమలుపరచకుండా గుంపులుగా తిరిగితే మాత్రం ప్రమాదం తప్పదు. ఇక దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరగడానికి కాస్త సమయం పడుతుంది. అయితే దాదాపు ఇది దేశమంతా ప్రభావం చూపించడానికి 6 నుంచి 8వారాల వరకూ పట్టొచ్చు’ అని డా. గులేరియా అన్నారు. ఇదంతా మనం అన్ లాక్ తర్వాత చూపించే ప్రవర్తనను బట్టి ఆధారపడి ఉంటుంది.ఇక ఇప్పటికీ దేశంలో 5శాతం జనాభా కరోనాకి వ్యాక్సినేషన్ చేయించుకున్నారు.

 ఇక మొత్తం దేశంలో ఉన్న 130 కోట్ల జనాభాలో 108కోట్ల మందికి ఏడాది చివరికల్లా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలనుకుంటుంది మన ప్రభుత్వం. వ్యాక్సినేషన్ అనేదే మెయిన్ ఛాలెంజ్.ఇక కొత్త వేవ్ విజృంభించడానికి దాదాపు మూడు నెలలు పట్టొచ్చు..లేదా ఇంకా తక్కువ వ్యవధిలోనూ జరగొచ్చు. ఇది పలు అంశాలపై ఆధారపడి జరుగుతుంది. కరోనా నిబంధనలు తప్పకుండా అనుసరించడం, కరోనా మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండటం వల్ల కరోనా వ్యాప్తిని తగ్గించవచ్చు. ఇక చివరి సారి కొత్త వేరియంట్ బయట నుంచి వచ్చి ఇక్కడ బాగా డెవలప్ అయింది. ఇక కొత్త మ్యూటెంట్లగా మారి ప్రమాదకరంగా కూడా మారింది’ అని ఎయిమ్స్ చీఫ్ అభిప్రాయపడ్డారు. ఇక ఇండియాలో కరోనా తొలి వేవ్ వచ్చినప్పుడు కరోనా వైరస్ అంత వేగంగా వ్యాపించలేదు. కరోనా సెకండ్ వేవ్ మాత్రం చాలా ప్రమాదవంతంగా మారింది. అయితే ఇప్పుడు రాబోయే డెల్టా వేరియంట్ అంతకుమించి వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ఇక మళ్లీ కరోనా కేసులు పెరగడం, అలానే హాస్పిటల్స్ లో బెడ్ల కొరత వంటి సమస్యలు అలానే ఉంటే చాలా నష్టం చూడాల్సి వస్తుంది. ఇక మనం చేయాల్సిందల్లా ఫ్రెష్ గా కరోనా కేసులు నమోదుకాకుండా చూసుకోగలగడమే’ అని డా. గులేరియా స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: