ఫాదర్స్ డే.. అమ్మ నవమాసాలు మోసి కంటే.. నాన్న ఆప్రాణాన్ని పదికాలాలు ఎలా బ్రతకాలో నేర్పిస్తాడు. అందుకే ఒక బిడ్డకు అమ్మా, నాన్న అవసరం చాలానే ఉంటుంది. అయితే వారి ప్రేమకు గుర్తుగా మదర్స్ డే, ఫాదర్స్ డే లను ప్రత్యేకంగా చేస్తారు. ప్రపంచం మొత్తంగా జూన్ నెల లో ఫాదర్స్ డే ను జరుపుకుంటారు. ఒక్కో దేశంలో ఒక్కో వారం జరుపుకోడవం చూస్తుంటాము. చాలా ప్రాంతాల్లో ఫాదర్స్ డేను జూన్ మూడో ఆదివారం జరుపుకుంటారు.


పోర్చుగల్, స్పెయిన్, క్రొయేషియా, ఇటలీ వంటి కాథలిక్ యూరోపియన్ దేశాలు మార్చి 19వ తేదీన ఫాదర్స్ డే ను జరుపుకుంటారని చెవుతున్నారు. ఇది ఇలా ఉండగా నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ లు నవంబర్ రెండో ఆదివారం జరుపుకుంటాయి.అందరికన్నా కూడా రష్యా ప్రజలు భిన్నంగా ఫిబ్రవరి 23 న ఈ రోజును  జరుపుకుంటారు. ఇలా ఒక్కో దేశం లో ఒక్కో రోజు జరుపుకోవడమే కాదు.. ఫాదర్స్ తో తమకున్న అనుభూతులను కూడా సోషల్ మీడియాలో పొందుపరుస్తారు. ప్రత్యేకమైన రోజుల ను ఎంతో ప్రతేకంగా జరుపుకుంటూ వస్తున్నా అమెరికా జూన్ 3 న ఫాదర్స్ డే ను సేలేబ్రెట్ చేసుకుంటారు. అందుకే జూన్ నెలకు అంత ప్రత్యేకత ఉంది.  


ఇకపోతే .. ఎటువంటి రోజు వచ్చినా కూడా గూగుల్ సరికొత్త ఆలోచనలు చేస్తూ వస్తుంది. యానిమేటెడ్ డూడుల్ తో ఆరోజు ప్రత్యేకతలను చూపిస్తుంది. అందుకే గూగుల్ అగ్రగామి సంస్థగా పేరొందింది.  ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా కొత్తగా ప్రయత్నించింది. అందరి దృష్టిని ఆకట్టుకోవడం తో పాటుగా సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది. ప్రపంచం లోని నాన్నలందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్లు సోషల్ మీడియా లో కీలకంగా ఉన్న గూగుల్ వెల్లడించింది ఫాదర్స్ డే డూడుల్ తో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది.మీరు కూడా గూగుల్ అద్భుతాన్ని చూసెయ్యండి.


మరింత సమాచారం తెలుసుకోండి: