ఈ మధ్య కాలంలో ఎవరైనా సరే కాస్తంత ఆరోగ్యం బాగాలేకపోయినా అటు డాక్టర్ దగ్గరికి పరుగులు పెడుతున్నారు.   రకాల చెకప్ చేయించుకుంటున్నారు. అయితే ఇక చిన్నగా ఫీవర్ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్లిన ప్రతి ఒక్కరికి ఇంజక్షన్ ఇవ్వడం మాత్రం తప్పనిసరి. అయితే ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ కొంత మందికి మాత్రం ఇంజెక్షన్ తీసుకోవడం అంటే ఏకంగా నరకం చూడటమే అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఇక డాక్టర్ ఇంజక్షన్ బయటకు తీస్తే చాలు అక్కడి నుంచి పరుగులు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు చాలా మంది. అయితే ఎక్కువగా చిన్న పిల్లలు ఇలా ఇంజక్షన్ కి భయపడుతూ ఉంటారు అని చెబుతూ ఉంటారు.



 కానీ కేవలం చిన్న పిల్లలు మాత్రమే కాదు ఎంతో మంది పెద్దవాళ్లు సైతం ఇలా ఇంజక్షన్ కు భయపడుతూ ఉంటారు అన్న విషయం చాలా మందికి తెలియదు.  ఇంజక్షన్ కి భయపడుతూ చాలామంది కేవలం టాబ్లెట్స్ తోనే సరిపెట్టుకుంటూ ఉంటారు .ఇక మరి కొంతమంది అసలు సూది లేని ఇంజక్షన్ ఉంటే ఎంత బాగుండు అని కోరుకుంటూ ఉంటారు.  ఇలా కోరుకునే వారికి ప్రస్తుతం నేను చెప్పేది ఒక గుడ్ న్యూస్ అవుతుంది  ఎందుకంటే ఇక ఇప్పుడు సూది లేకుండానే ఇంజక్షన్ తీసుకోవచ్చు. సూది లేకుండా ఇంజక్షన్ తీసుకోవడమా జోక్ వేస్తున్నారా అని అంటారా.



 జోక్ వేయడం లేదు నిజమే చెబుతున్నా.. ఇక ఇప్పుడు సూది లేకుండానే ఇంజక్షన్ తీసుకోవచ్చు. కరోనా సమయంలో టీకా చేసుకోవడం తప్పనిసరి గా మారిపోయింది. కానీ చిన్నపిల్లలు వ్యాక్సిన్ వేసుకోవాలంటే భయపడతారు.  చిన్నపిల్లలు ఇంజక్షన్ చూస్తే పరుగో పరుగు అంటారు. కాబట్టి వారి కోసం ఏకంగా ఫార్మాజెట్ అనే సాధనాన్ని రూపొందించారు శాస్త్రవేత్తలు  సూది లేకుండానే ఇది నేరుగా చర్మంలోకి టీకా పంపిస్తుంది  త్వరలో పన్నెండేళ్లు దాటిన వారికి టీకా వేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇక ఈ పరికరాన్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు.  త్వరలో జైకోవ్ డి అనే టీకాను ఇదే రీతిలో వేయనున్నారు. ఇలా డీఎన్ఏ ద్వారా రూపొందిన తొలి వ్యాక్సిన్ ఇదే కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: