ఎప్పుడైనా డ్రోన్ మీద పక్షులు దాడి చెయ్యడం చూసారా.. అయితే ఇది చూడండి. ప్రస్తుతం సోషల్ మీడియాని తెగ ఊపేస్తుంది.డ్రోన్ మీద ఊహించని పక్షుల దాడి ఆశ్చర్యం కలిగించే వీడియో ఒకటి ఇప్పుడు ఆస్ట్రేలియా దేశం నుండి బయటపడింది. ఈ వారం నుండి ఆ దేశంలో కస్టమర్ ఎయిర్ డెలివరీ ద్వారా తన రెగ్యులర్ బెవరేజ్ ఆర్డర్ కోసం ఎదురుచూస్తున్నప్పుడు ఈ వీడియో బయట పడింది. అప్పుడే అతని డ్రోన్‌పై ఓ కాకి దాడి చేస్తున్నట్లు చూశాడు, ఆ కాకి ఆకారంలో పెద్దదిగా కనిపిస్తుంది. ఒక కాకి డ్రోన్‌పై తీవ్రంగా దాడి చేసి, దాని ముక్కుతో హింసాత్మకంగా కొట్టిన వీడియోను అతను తీయగలిగాడు. అది ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆ భారీ పక్షి బరువు కింద, డ్రోన్ తనను తాను విడిపించుకోవడానికి చాలా ప్రయత్నించింది.ఇంకా తరువాత ఆ పోరాటంలో భూమి పైకి ఆకాశం నుండి ఆ డెలివరీ కింద పడిపోయింది. ఇక ఆ తర్వాత ఆ కాకి అక్కడ నుంచి హడావుడిగా వెళ్లిపోయింది.

ఇక ఆ డ్రోన్ విషయానికి వస్తే డ్రోన్ అది వింగ్‌ సంస్థకు చెందినది, ఎయిర్ డెలివరీ సేవ కాఫీ, ఆహారం, మెడిసిన్ ఇంకా హార్డ్‌వేర్ సరఫరాలను కాన్బెర్రా, ఆస్ట్రేలియాలో గూగుల్ భాగస్వామ్యంతో వింగ్ అందిస్తుంది.ఇక అక్కడ స్థానిక పక్షి నిపుణులు ప్రాదేశిక జాతుల ప్రవర్తనను విశ్లేషిస్తుండగా, వింగ్ పొరుగున ఉన్న అనేక ప్రాంతాల్లో కూడా డెలివరీలను తాత్కాలికంగా డ్రోన్ సేవలను నిషేధించడం జరిగింది. ఇక వింగ్ ప్రారంభంలో 2019 లో ఆస్ట్రేలియన్ క్యాపిటల్ టెరిటరీ (ACT) లో ప్రవేశపెట్టబడింది. మరియు ఇటీవలి కోవిడ్ -19 లాక్డౌన్ సమయంలో 10,000 డెలివరీలతోచాలా త్వరగా ప్రజాదరణ పొందింది.ఈ డ్రోన్‌పై దాడి చేసిన పక్షంలో ఆ కాకికి అయితే ఎలాంటి హాని జరగలేదని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఆ ప్రాంతంలో వింగ్ ఎగరకపోవడం వల్ల,కాకి దానిని తరిమికొట్టడంలో విజయవంతమైందని భావించవచ్చు, అని ఒక పక్షి నిపుణుడు పేర్కొనడం జరిగింది. ఇక ఈ సంఘటన వింగ్ దాని కార్యకలాపాలు మరెక్కడా ప్రభావితం కాలేదని, ఇక దాని డ్రోన్ విమానం కారణంగా ఏ పక్షులకు గాయాలు కాలేదని పేర్కొనడం జరిగింది.
 
https://youtu.be/SAshKROIjtQ

మరింత సమాచారం తెలుసుకోండి: