ఎవరికైన ఆరునెలలకు లేక సంవత్సరానికో అన్న ప్రాసన చేస్తారు.. ఇదేంటి 15 ఏళ్ళ బాలుడికి ఇప్పుడు అన్నప్రాసన కార్యక్రమం ఏంటి అనుకుంటున్నారా . అవునండి మీరు చదువుతున్నది అక్షరాలా నిజమే హైదరాబాద్ కి చెందిన 15 సంవత్సరాల బాలుడికి అన్నప్రాసన జరిగింది. హైదరాబాద్ నగరం లోని పాతబస్తీకి చెందిన ఆటో డ్రైవర్ సాబీర్ కు తన్వీర్ అనే కుమారుడు ఉన్నాడు. అతడు పుట్టినప్పటి నుండి కనీసం అన్నం అంటూ తిని ఎరుగడు. అతడికి ప్రస్తుతం 15 సంవత్సరాలు, పదవ తరగతి పూర్తి చేసుకొని ఇంటర్ చదువుతున్నాడు. 



తన్వీర్ కి చిన్నప్పటినుండి అన్నం అంటే ఇష్టం లేకపోవడంతో కేవలం రోటి, బజ్జి , ఛాయ్ బన్ ని మాత్రమే ఆహారంగా తీసుకునే వాడు కారణమేమిటంటే అన్నం తింటే వెంటనే వాంతికి కి చేసుకోవడం నిత్యసాధారణం కాబట్టి . ఇతడికి రెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతడిని ఓ డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళినప్పుడు ఇతడికి అన్నం అంటే వాంతి చేసుకుంటున్నాడు కాబట్టి కొన్ని రోజులు వేచి చూడమన్నారట. అప్పట్నుంచి అతడికి ఛాయ్ బన్ , రోటి , బజ్జిలను మాత్రమే తినిపించేవారు. ఆఖరికి అతడు తన చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇదే రకమైన ఫుడ్ ని అందించేవారు. ఇతడికి ఇంత వయసు వచ్చినా అన్నం పట్ల అతడికి అయిష్టం ఏంటని అనుమానంతో మరోసారి డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లారు.




 అతని ఆరోగ్య పరిస్థితి పరిశీలించిన డాక్టర్స్ అతడు అన్నం తీసుకోకపోతే బాగా నీరసపడిపోతాడని చెప్పారు. అంతే తన్వీర్ కి ఆపరేషన్ రైస్ ఫుడ్ ఫీడింగ్ స్టార్ట్ చేశారు. మొదట అతని తల్లి అతడికి బలవంతంగా అన్నం తినిపించింది వెంటనే అతడు అన్నాన్ని వాంతి చేసుకున్నాడు . ఐన సరే అని అతని తండ్రి సాబీర్ కూడా అతడికి బలవంతంగా ఫుడ్ తినిపించే ప్రయత్నం చేశాడు...కొద్దిసేపటికి వాంతులు అనంతరం మల్లి ఆలా చేసారు ..ఈ సారి అతను తన వాంతి నిలుపుకున్నాడు..ఈ విషయాన్నీ అతని నానమ్మ , తాతయ్యలకు మిగతా బందు మిత్రులకు తెలుపగా అందరు సంతోషించారు. వారు తమ సంతోషాన్ని ఆపుకోలేక వెంటనే ఓ పూల మాలను తయారు చేసి అతనికి ధరింపచేసి వెంటనే వారుకూడా అతనికి అన్నం తినిపించారు. ఈ రకంగా తన్వీర్ తన 15వ యేటా అన్నప్రాసన చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ వుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: