ఇకపోతే లాక్ డౌన్ అంటే రొటీన్ వ్యాపారం చేయడానికి కుదరదు కాబట్టి అతని ఇంటి మీద మిర్యాల మొక్కలను పెంచడం ప్రారంభించాడు. ఈ మిరియాల మొక్కలను సందర్శించడం కోసం రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలనుండి శాస్త్రవేత్తలు, విద్యార్థులు, పరిశోధకుల తో సహా సందర్శకులను కూడా బాగా ఆకర్షిస్తోంది ఈ మిరియాల పంట.. కేవలం 1500 చదరపు అడుగుల టెర్రస్ పైన ఆయన ఏకంగా 48 మిరియాల మొక్కలను ఒక ప్రత్యేకమైన పద్ధతి ద్వారా పెంచి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.
పంట సాగు గురించి ఆయన మాట్లాడుతూ.. గత 4 సంవత్సరాలుగా కేరళకు బయట నివసిస్తూ అకస్మాత్తుగా నేను చర్చికి వెళ్లి నిర్వహించాల్సిన ప్రార్థనలు సమావేశాలు ఏమీ లేవు.. కాబట్టి ఇంట్లోనే ఏదైనా ఉత్పాదక ఎంపికల కోసం వెతకడం ప్రారంభించాను. ఇక ఇంటికి అవసరమయ్యే పంటల గురించి పరిశోధన చేసి, తమ కాంపౌండ్ లోనే కూరగాయలు , దుంపలు బాగా పండడం తో టెర్రస్ పైన మిరియాలను పండించాలని నిర్ణయించుకున్నానని ఆయన తెలిపాడు.
కాకపోతే ఈయన సాగు చేసిన పద్ధతి చాలా ప్రత్యేకమైనది.. కావడంతో కేరళ స్టేట్ కౌన్సిల్ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ నిర్వహించే వార్షిక కార్యక్రమం రూరల్ ఇన్నోవేటర్స్ మీట్ 2021 కి ఎంపిక చేయబడి ప్రస్తుతం ఆయనకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. దానికి మిగతా పంటలలా కాకుండా మిరియాల మొక్కలు ఎక్కువ కాలం జీవిస్తాయి.. కాబట్టి వీటికి కుండీలు మినహాయించి డ్రిప్ ఇరిగేషన్ మాదిరిగా అనుకూలమైన పద్ధతిని ఏర్పాటు చేస్తే పంట సాగు బాగా కొనసాగుతుంది.
ఆయన రెండు పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ములను రెండుగా కట్ చేసి, అందులో ట్రైకోడెర్మా తో అటువంటి వేపపిండి, ఆవు పేడ, కొబ్బరిపీచు కంపోస్టు ,సున్నపురాయి పొడి, ఎముకల పిండి , శుద్ధమైన మట్టి ఇలా అన్నింటినీ బాగా డ్రమ్ములో నింపారు. మిరియాల కొమ్మలు తీగలు వెళ్తాయి కాబట్టి దృఢమైన స్తంభాలు నాటడం వల్ల చెట్టు అభివృద్ధి కూడా బలంగా ఉంటుంది అని ఆయన తెలిపాడు. ముఖ్యంగా 2020 మే లో మొక్కలు నాటగా ప్రస్తుతం కోతకు సిద్ధంగా ఉన్నాయట. ఇక వారు ఆ పంట నుంచి మూడు నుండి నాలుగు మిరియాలను ఆశిస్తున్నాము అని యొహన్నన్ తెలిపాడు. ఇక ప్రస్తుతం ఈయనకు మంచి దిగుబడి కూడా వస్తున్నట్లు, మరో మూడు సంవత్సరాల పాటు లాభం పొందవచ్చునని ఆయన తెలిపాడు. ఆలోచనా విధానం.. చేయాలనే పట్టుదల ఉండాలే కానీ ప్రతి ఒక్కరూ ఏదైనా సాధించగలరు అని ఆయన నిరూపించాడు. ఇక మీరు కూడా ఖాళీగా ఉన్నట్లయితే ఇలాంటి పద్ధతులను పాటించి కొత్త ఆవిష్కరణ కు శ్రీకారం చుట్టండి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి