సాధారణంగా మనం ఇంటి నుంచి బయటకు రాగానే ఎండను చూడగానే చాలామందికి బాగా తుమ్ములు వస్తుంటాయి. అయితే సూర్యుడిని నేరుగా చూస్తున్నప్పుడు మాత్రమే ఇలా ఎందుకు జరుగుతుంది అనేది అస్సలు ఎవరికైనా తెలుసా?.
అయితే, దీనికి అస్సలు కారణమేంటో.. సైన్స్ ఏం చెబుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శాస్త్రీయ భాషలో మాత్రం దీనిని సన్ స్నీజింగ్ అంటారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కి చెందిన హెడ్ అండ్ నెక్ సర్జన్ అనే ప్రఖ్యాత నిపుణులు బెంజమిన్ బ్లెయిర్ ప్రకారం ఒక వ్యక్తి తలను ప్రకాశవంతమైన కాంతి కిరణాలు తాకినప్పుడు తుమ్ములు వస్తుంటాయట.. ఇది 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు వారిలో ఎక్కువగా కనిపిస్తుందని ఇది పురుషుల కంటే స్త్రీలలో బాగా ఎక్కువగా జరుగుతుంది.

ముఖ్యంగా ఒక తరం నుండి మరొక తరానికి సంక్రమించే జన్యుసంబంధమేనట దీనికి అస్సలు కారణం అని డాక్టర్ బెంజమిన్ చెప్పారు. సాధారణ భాషలో, తల్లిదండ్రుల నుండి వచ్చే జన్యువులలో ఒకదానిలో మ్యుటేషన్ ఉంటుందని దీని కనెక్షన్ సూర్యుడిని కిరణాలతో వచ్చే తుమ్ములతో ముడిపడి ఉంటుందని అందువల్ల ఎండలో తుమ్మడం అనే అలవాటు ఉన్న తల్లిదండ్రుల నుంచి వారి పిల్లలకు అది సంక్రమిస్తుంది.అయితే, ఇలా ఎందుకు జరుగుతుందో అనేదానిపై ఖచ్చితమైన కారణంఅయితే తెలిసి రాలేదు.

ఇలా తుమ్ములు రావడానికి వెనుక అస్సలు కారణం ఏమిటనే దానిపై అనేక సిద్ధాంతాలు చెప్పారని డాక్టర్ బెంజమిన్ తెలిపారు.దీనికి సంబంధించి మొదటి సిద్ధాంతాన్ని గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ క్రీపూర్వం 350లో తెలిపారని సమాచారం.అరిస్టాటిల్ ప్రకారం సూర్యుని కిరాణాలలోని వేడి ముక్కు రంధ్రాల ద్వారా ప్రవేశించడంతో ముక్కులోని సెన్సిటీల్ పుటాలనేవి స్పందించడం ద్వారా వ్యక్తులు తమ్ముతారట.అయితే, 17వ శతాబ్దంలో ఆంగ్ల తత్వవేత్త అయిన ఫ్రాన్సిస్ బేకన్ అరిస్టాటిల్ సిద్ధాంతాన్ని బాగా తిరస్కరించాడు. తన వెర్షన్‌ను ప్రపంచానికి తెలియ జేశాడు.సూర్యడిని కళ్లతో చూస్తే మనకు తమ్ములు వస్తాయని ఆయన వాదించాడు. కళ్లు మూసుకుంటే తమ్ములు అస్సలు రావని చెబుతూ.. తమ్ములకు మరియు కళ్లకు సూర్యూడిని సంబంధం ఉందని చెప్పుకొచ్చాడట.


దీని తర్వాత కూడా తమ్ములపై అనేక అధ్యయనాలు జరిగాయట. సూర్యడిని చూడగానే తుమ్ములు రావడానికి కాంతి తీవ్రతే ముఖ్య కారణమని చాలామంది తేల్చారట.. ఒక నిర్ధిష్ట, అధిక తీవ్రతతో కూడిన కాంతిని చూసినప్పుడు మాత్రమే ఇలా జరుగుతుందని ఆ కాంతి కారణంగా ముక్కు ఒక రకమైన అనుభూతి చెందడంతో మనకు తుమ్ములు వస్తాయట.


ఖచ్చితమైన కారణం మాత్రం ఇప్పటికీ తెలియదు..
ఇన్ని పరిశోధనలు జరిగినప్పటికీ కూడా సూర్యడికి మరియు తుమ్ములు రావడానికి సంబంధించి ఖచ్చితమైన కారణాలు మాత్రం అస్సలు తెలియలేదు. అయితే, శాస్త్రవేత్త హెన్రీ ఎవెరెట్ అభిప్రాయాన్ని మాత్రం దాదాపు అందరూ కూడా అంగీకరించారు. డాక్టర్ హెన్నీ తన సిద్ధాంతం ప్రకారం.1964లో దానిని వెల్లడించాడట.దీని ప్రకారం.. ఒక వ్యక్తి ఎండలోకి ప్రవేశించినప్పుడు వారి కళ్లపై బలమైన కాంతి పడుతుందని అప్పుడు ఆ వ్యక్తి కళ్లు సంకోచం చెందుతాయని మెదడు సిగ్నల్స్ మోసే నాడీ కణాలు ఎంతో గందరగోళానికి గురవుతాయి. అలా తమ్ములు వస్తాయని హెన్నీ పేర్కొన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: