ఇదిలా ఉండగా తాజాగా ఈ రోజు ఉదయం టీ టీ డీ ఉదయాస్తమాన టికెట్లను విడుదల చేసింది. అంతేకాదు శ్రీవారి దాతలకు ఒక శుభవార్త ను వెల్లడించింది.. అదేమిటంటే తిరుపతిలో ఏర్పాటు చేసిన చిన్న పిల్లల ఆసుపత్రి నిర్మాణానికి నిధులు ఇచ్చిన దాతల కోసం ఉదయాస్తమాన టికెట్లను ఉచితంగా కేటాయించడం గమనార్హం. వీరికోసం ప్రివిలేజ్ గా టికెట్లను కేటాయించడం హర్షదాయకం అని చెప్పవచ్చు. అసలు సంచలన విషయం ఏమిటంటే అర్ధగంటలో చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణానికి సుమారుగా 58 కోట్ల రూపాయల విరాళాలు అందాయి. నేటికి టీటీడీ వెబ్ సైట్లు విరాళాల ప్రక్రియ కొనసాగుతోంది.
ఇక 28 శుక్రవారం ఉదయాస్తమాన టికెట్లను అందుబాటులో ఉంచింది.. అలాగే 503 సాధారణ రోజుల ఉదయాస్తమాన టికెట్లను కూడా అందుబాటులో ఉంచడం గమనార్హం. అంతేకాదు కోటి రూపాయలు విరాళంగా చెల్లించిన వారికి సాధారణ రోజుల్లో ఉదయాస్తమాన టికెట్లు రూ.1.50 కోటికిపైగా విరాళంగా సమర్పించిన వారికి శుక్రవారం ఉదయాస్తమాన టిక్కెట్లను మంజూరు చేయడం. ఇప్పటికే 24 ఉదయాస్తమాన శుక్రవార టికెట్లు.. 22 సాధారణ రోజుల ఉదయాస్తమాన టికెట్లు బుక్ అవడం జరిగింది. ఇలా ఉండగా కేవలం అరగంటలోనే 58 కోట్ల రూపాయల విరాళాలు అందాయి అంటే ఇక భక్తుల్లో మానవత్వం కూడా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి