అనుకున్న లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల ఉంటే చాలు..ఎవరెస్టును అయిన సులువుగా ఎక్కవచ్చు అని చాలా మంది నిరూపించారు. మనసులో ఆలోచన, కష్టపడే తత్వం ఉంటే చాలు వయస్సుతో సంబంధం లేదని ఓ చిన్నోడు నిరూపించాడు.చూడటానికి చేతిలో గరిట అంత లేకున్నా కూడా గుమ గుమలాడే వంటను వండటంలో మంచి నేర్పరి..అతడి చేతిలో ఏదో మ్యాజిక్ ఉందని ఆ ప్రాంతంలోని స్థానికులు అంటున్నారు. ఒకసారి అక్కడ తింటే మళ్ళీ మళ్ళీ వచ్చి తింటారని అంటున్నారు. ఆ బుడ్దొడి స్టోరీ గురించి ఒకసారి చూసేద్దామా..


తాజాగా.. పిల్ల వాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఈ వీడియోలో.. పిల్లవాడు రోడ్డు పక్కన ఉన్న బండిపై చైనీస్ ఆహారాన్ని తయారు చేస్తున్నాడు. ఈ వీడియో చూసి నెటిజన్లు భావోద్వేగానికి గురవ్వడంతోపాటు.. తెగ మెచ్చుకుంటున్నారు. చదువుకునే వయసులో ఉన్న ఈ బుడతడు.. చిన్న వయసులోనే కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడంలో బిజీగా ఉన్నాడు. పిల్లవాడు ఎంత అంకితభావంతో పనిచేస్తున్నాడని వైరల్ అవుతున్న ఆ వీడియోను చూస్తే తెలుస్తుంది.ఆ వీడియో లో ఆ పిల్లోడు నూడిల్స్ ను తయరూ చేస్తూ కనిపిస్తాడు.వీడియో కొన్ని సెకన్లు మాత్రమే అయినప్పటికీ.. చాలా మంది నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. కస్టమర్‌ల కోసం ఈ పిల్లవాడు పూర్తిగా వంటపైనే ఫోకస్ చేసి చైనీస్ ఫుడ్‌ను సిద్ధం చేస్తున్నాడు. అయితే.. ఎత్తు తక్కువగా ఉండటం వల్ల పిల్లవాడు స్టూల్‌పై నిలబడి వంటను సిద్ధం చేయడాన్ని చూడవచ్చు.దాన్ని చేయడానికి ఆ పిల్లాడు ఎంత కష్ట పడుతున్నాడో వంట కూడా అంతకు మించి రుచిగా వుంటుందని అందరూ కితాబు ఇస్తున్నారు.5 లక్షల 44 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసారు. ఈ వీడియో చూసి.. ఈ బుడతడిపై దేవుడు చల్లని చూపు చూడాలని అంటున్నారు.. మీరు ఆ వీడియో చూసి ఒక లైక్ వేసుకోండి..


మరింత సమాచారం తెలుసుకోండి: