ఏకంగా కొంతమంది అయితే తమ రోజువారి పనుల్లో కుక్కలు కూడా సహాయం చేసే విధంగా వాటికి ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారూ. యజమాని చెప్పినట్టుగానే కుక్కలు ఏకంగా ఇంట్లో పనుల్లో చేదోడువాదోడుగా ఉండటం చూస్తూ ఉంటాము. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి. ఇలాంటివి చూసిన తర్వాత దొంగలు పడకుండా కుక్కలు ఇంటికి కాపలా కాయడమే కాదు యజమానులకు సహాయం కూడా చేస్తున్నాయ్ అని ఎంతోమంది జంతు ప్రేమికులు వీడియోలు చూసి మురిసిపోతూ ఉంటారు.
ఇక ఇప్పుడు ఇక్కడ ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది. గతంలో యజమానురాలు కుక్క కలిసి యోగ చేస్తున్న వైరల్ గా మారగా.. ఇక ఇప్పుడు అదే కుక్క అదే యజమాని వార్తల్లో నిలిచారు. వీడియోలో కనిపించే కుక్క పేరు సీక్రెట్.యజమానురాలు పేరు మేరీ. సదరు శునకం ఇంట్లోని పనులన్నింటిని కూడా చేస్తూ ఉంది. ఈ క్రమంలోనే బట్టలు ఉతకడం లో కూడా యజమానురాలు సహాయం చేసింది. బట్టలు ఆరిన తర్వాత వాటిని ర్యాక్ లో పెట్టడంలో కూడా సహాయం చేసింది అని చెప్పాలి. ఈ వీడియో చూసిన తర్వాత వామ్మో ఈ కుక్కకి భలే తెలివి ఉంది అంటూ అందరూ అవాక్కవుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి