ఇక చాలా మంది కూడా చిన్న పాము కనిపిస్తేనే.. ఆమడ దూరం పరుగెత్తి భయంతో బాగా వణికిపోతారు. అయితే ఇంకాస్త పెద్ద పాము కనబడితే..దెబ్బకు వెన్నులో వణుకు పుట్టి ఒళ్లంతా కూడా బాగా చెమటలు పట్టేస్తాయి. ఇక కొండ చిలువ కనిపిస్తే మాత్రం ఒక్కసారిగా గుండె ఆగినంత పనవుతుంది. అలాంటిది ముగ్గురు చిన్నారులు ఓ పెద్ద కొండ చిలువను పట్టుకుని సాహసమే చేశారు. తమ కుక్కను కొండ చిలువ భారీ నుంచి కాపాడడానికి తమ ప్రాణాలను వారు పళంగా పెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.ఇక వీడియో ప్రకారం.. ఓ మైదాన ప్రాంతంలో ఓ భారీ కొండ చిలువ అక్కడ ఓ కుక్కను చుట్టేస్తోంది. దాంతో ఆ అక్కకు పక్కకు జరిగే అవకాశం కూడా ఉండదు. ఇక ఈ ఘటనను ఓ ముగ్గురు పిల్లలు చూస్తారు. వారు అసలు ఎలాంటి భయం లేకుండా కొండ చిలువతో పోరాడతారు. చేతిలో కర్రను పట్టుకున్న ఓ పిల్లవాడు కొండ చిలువ తలపై బాగా కొడతాడు. మిగతా ఇద్దరు తమకు దొరికిన వాటితో డాన్ని కొడుతారు. అయినా కూడా ఆ కొండ చిలువ ఆ కుక్కను అస్సలు వదలదు.చివరకు ఓ పిల్లాడు కర్ర సాయంతో ఆ కొండ చిలువ తలను అదిమి పట్టి.. దాని తలను ఒడుపుగా పట్టుకుంటాడు. 


వెంటనే ఓ పిల్లాడు వచ్చి ఆ పాము తోకను పట్టుకోగా.. ఇంకో పిల్లాడు ఆ కొండ చిలువ నుంచి కుక్కను కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. చివరకు ఆ పిల్లలు ముగ్గురూ కూడా కొండ చిలువ నుంచి కుక్కను కాపేడేస్తారు. పాము పట్టు నుంచి తప్పుకున్న ఆ కుక్క ఒక్కసారిగా అక్కడి నుంచి పారిపోతుంది. ఆపై పిల్లలు ఇక ఆ పామును చంపేస్తారు.ఇక ఈ వీడియోను సోషల్ మీడియాలో 'ఫిగెన్సెజ్గిన్' అనే ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేయబడింది. 'ఈ పిల్లలకు పెద్ద దండాలు' అని ఆ క్యాప్షన్‌లో రాశారు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.చిన్నారుల ధైర్యసాహసాలకు నెటిజన్లు చాలా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియోకి మొత్తం 18 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అలాగే ఈ వీడియోను 8 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఇంకా అదే సమయంలో 1 లక్ష మందికి పైగా రీట్వీట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: