గర్భిణులు, పిల్లలు, ఆర్థో సంబంధిత వ్యాధులకు చికిత్స అందిస్తారు. ప్రస్తుతం ఆసుపత్రి లో 18 వైద్యులు ఉన్నారు. కేవలం కన్సల్టెన్సీకి మాత్రమే పరిమితం కాకుండా ల్యాబ్, ఎక్స్‌రే, ఫిజియో థెరపీ, ఐసీయూ, అల్ట్రాసౌండ్ లాంటి పరీక్షల ను కూడా తక్కువ ధరకే నిర్వహిస్తున్నారు. అలాగే.. ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకుల కు ఉచితంగా భోజనం, టిఫిన్లు అందిస్తున్నారు. ఆయూష్, ఆరోగ్య శ్రీ పథకాలు కూడా ఇందులో అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆసుపత్రికి రోజుకు 200 మంది రోగులు వస్తున్నారు. మరి కొద్ది రోజుల లో మరి కొన్ని సేవలను పెంచనున్నారు.. అందుబాటు లోకి తీసుకొస్తామని నిర్వాహకులు చెబుతున్నారు..ప్రస్తుతం ఈ ఆసుపత్రికి చాలామంది రోగులు వస్తున్నారు.మంచి ఆదరణ కూడా పొందింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి