సోషల్ మీడియాలో నిత్యం ఏదొక వార్త వైరల్ అవుతుంది..కొన్ని వార్తలు షాక్ ఇస్తే మరి కొన్ని మాత్రం అందరి చేత చివాట్లు తింటాయి..ఇలాంటి వార్తలు వైరల్‌ అవ్వడంతో విమర్శలు కూడా అందుకుంటాయి..తాజాగా ఓ వార్త సామాజిక మాద్యమాల్లో దుమారం రేపుతున్నాయి..ఓ వృద్దురాలు తన డెత్ సర్టిఫికెట్ పోయిందని,తనది కనిపిస్తే నాకు పంపండి అంటూ విజ్ఞప్తి చేసింది.అది కాస్త నెట్టింట చక్కర్లు కోడుతుంది...
 


మ్యాటర్ లోకి వస్తే..పెన్షన్‌ కోసం ఓ వ్యద్ధురాలు దరఖాస్తు చేసుకుంటే.. రికార్డుల్లో ఆమె చనిపోయినట్లు ఉందని, ఆమెకు పించన్‌ ఇవ్వడానికి నిరాకరించారు అధికారులు. ఇటువంటి సంఘటనలు దేశ నలుమూలల్లో ఏదో ఓ చోట నిత్యం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అస్సాంకి చెందిన రంజిత్‌ కుమార్‌ అనే సెప్టెంబర్‌ 7వ తేదీన నాగాన్‌లోని లుమ్డింగ్ బజార్ వద్ద తన డెత్‌ సర్టిఫికేట్ పోగొట్టుకున్నట్లు న్యూస్ పేపర్‌లో ప్రకటన ఇచ్చాడు. ఈ ప్రకటనలో తను పోగొట్టుకున్న డెత్‌ సర్టిఫికేట్‌ నంబర్‌ కూడా పేర్కొన్నాడు.


ఈ మేరకు తన డెత్‌ సర్టిఫికేట్‌ దొరికిన వారు తక్షణమే తనకు అందించవల్సిందిగా విజ్ఞాపన చేసుకున్నాడు. పీఎస్‌ అధికారి రుపిన్ శర్మ ఇట్‌ హ్యాపెన్స్‌ ఓన్లీ ఇన్‌ ఇండియా అనే క్యాప్షన్‌తో ఈ పేపర్‌ యాడ్‌కు సంబంధించిన క్లిప్‌ను ట్విటర్‌లో షేర్‌ చేశాడు. అయితే, ప్రస్తుతం ఈ పేపర్ యాడ్‌ను చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో జోకులు పేలుస్తున్నారు. ఈ వ్యక్తి స్వర్గం నుంచి సాయం కోరుతున్నాడు, ఒకవేళ సర్టిఫికేట్ దొరికితే స్వర్గాని పంపాలా.. లేక నరకాని పంపాలా.., దెయ్యం చేస్తున్న అత్యంత దీనమైన అభ్యర్యన, ఒక వ్యక్తి తన డెత్‌ సర్టిఫికేట్‌ పోగొట్టుకున్నాడు.


ఎవరికైనా దొరికితే తనకు ఇచ్చేయండి. దయచేసి దీనిని అత్యవసరంగా పరిగణించండి. లేకపోతే ఆ దెయ్యం ఆగ్రహం చెందుతుంది, మొట్టమొదటి సారిగా ఓ వ్యక్తి తన డెత్‌ సర్టిఫికెట్ పోగొట్టుకున్నాడని' ఇలా రకరకాల కామెంట్స్ తో  నెటిజన్లు ఫన్నీగా కామెంట్‌ చేస్తున్నారు..మొదట ఇది కామెడీగా ఉన్నా కొంత ఆలోచిస్తే లోపల మర్మం అర్ధం అవుతుంది. ఇతని విషయంలో కూడా అదే జరిగింది. సాధారణంగా డెత్‌ సర్టిఫికెట్‌ చనిపోయిన తరువాత ఇస్తారు. డెత్‌ సర్టిఫికెట్ పొందడానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దానికి సంబంధించిన వివరాలు నమోదు చేసుకుంటే అధికారులు డెత్‌ సర్టిఫికెట్‌ జారీ చేస్తారు. బతికున్నవారిని రికార్డుల్లో చనిపోయినట్లు రాసుకునే అధికారులకు ఈ ప్రకటన చెంప పెట్టు లాంటిది..అంతేకదా..

మరింత సమాచారం తెలుసుకోండి: