సోషల్ మీడియాలో ఎప్పుడూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ఇలా నెట్టింట్లో వచ్చిన కొన్ని వీడియోలు నేటిజన్లు అందరిని కూడా ఆకర్షిస్తూ ఉంటాయి అని చెప్పాలి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు అయితే మరింత ఎక్కువగా చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఇక ఇప్పుడూ ఒక చింపాంజీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది. అయితే సాధారణంగా మనుషుల తర్వాత అతి తెలివి కలిగిన జంతువులు కోతులు చింపాంజీలు అని చెబుతూ ఉంటారు.


 అంతేకాదు  ఇక మనిషికి ఒకప్పటి రూపం కూడా ఈ చింపాంజీలు కోతులే అని ఎంతో మంది శాస్త్రవేత్తలు ఇప్పటికే ఆధారాలతో సహా నిరూపించారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే చింపాంజీలు కొన్ని కొన్ని సార్లు చేసే పనులు కోతి నుంచి మనిషి పుట్టాడు అన్న విషయాన్ని మరోసారి చెప్పకనే చెబుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇకపోతే చింపాంజీలు ఎప్పుడు మనుషుల్లానే ప్రవర్తిస్తూ ఉంటాయ్. ఎమోషన్స్ చూపించడం విషయంలో కూడా మనుషులు ఎలా చేస్తారో చింపాంజీలు కూడా అలాగే చేస్తాయి. కాగా ఇటీవలే  వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే చింపాంజీ వ్యవహార శైలి అందర్నీ ఆశ్చర్యంలో ముంచేత్తుతోంది.


 సాధారణంగా మనుషులు సన్ గ్లాసెస్ పెట్టుకొని కొబ్బరి బొండం తాగుతూ అనుభవించు రాజా అన్నట్లుగా  ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు చింపాంజీ కూడా అచ్చం మనుషుల్లాగే ఇలాగే చేసింది. లింబాని అనే పేరు గల చింపాజీ సన్ గ్లాసెస్ పెట్టుకొని కొబ్బరి బోండాలో స్ట్రా వేసుకొని స్టైల్ గా నీరు తాగుతూ కనిపించింది ఆ తర్వాత అంతే స్టైల్ గా తన కళ్ళకు ఉన్న కళ్లద్దాలు తీసింది. ఇక చింపాంజీ.ఇలా ఎంతో స్టైల్ గా కొబ్బరి నీళ్లు తాగడం చూసి నెటిజెన్లు అందరూ ఫిదా అయిపోతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: