
ఇక ఇలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయం తెలిసినప్పటికీ నేటి రోజుల్లో ఎంతో మంది జనాలు మాత్రం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. చివరికి రైలు ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా నేటి రోజుల్లో ఎవరైనా యువకులు చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకున్నారు అంటే చాలు లోకాన్ని మర్చిపోతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు హెడ్ ఫోన్స్ పెట్టుకొని రైల్వే ట్రాక్ పై నడుస్తూ చివరికి ప్రమాదాలకు గురవుతున్నారు.
ఇకపోతే రైల్వే ట్రాక్ పై హెడ్ ఫోన్స్ పెట్టుకొని నడిస్తే ఎంతటి ప్రమాదం జరుగుతుంది అన్నదానికి నిదర్శనంగా ఇక్కడ ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక ఇటీవల వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే ఒక విదేశీ మహిళ రైల్వే క్రాసింగ్ దాటుతుంది. అయితే రైలు వస్తుందా లేదా అన్న విషయాన్ని చూడకుండా హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ బిజీగా ఉంది. అంతలోనే అక్కడికి రైలు దూసుకు వచ్చింది. అయితే ఇంతలో రైలు ఆ యువతీని ఢీకొట్టింది. అయితే లక్కీగా ఆ యువత చివరి క్షణంలో రైలును చూసి కొంత వేగంగా నడవడంతో ప్రమాదం తప్పింది. అప్పటికే మరో ట్రాక్ పై పడిపోయింది యువతీ.