ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు తెగ వైరల్ గా మారిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా విషసర్పాపాలకు సంబంధించిన వీడియోలు ఏవైనా సోషల్ మీడియాలోకి వచ్చాయి అంటే చాలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తూ ఉంటాయని చెప్పాలి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఎంతోమంది స్నేక్ క్యాచర్లు ఎక్కడైనా పాములు పట్టుకోవడానికి వెళ్లిన సమయంలో ఇక అక్కడ పామును పట్టుకుంటున్న సంఘటనను మొత్తం వీడియో తీసి ఇక యూట్యూబ్లో పోస్ట్ చేయడం లాంటివి చేస్తూ ఉన్నారు. తద్వారా ఇక యూట్యూబ్లో బాగా పాపులారిటీ సంపాదించుకుంటూ ఉన్నారు.


 అయితే ఇలా విషపూరితమైన పాములను నేరుగా చూసినప్పుడు ఎంతగానో భయపడిపోయే జనాలు అటు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిన వీడియోలను చూసేటప్పుడు మాత్రం కాస్త ఆసక్తిగా వీక్షిస్తూ ఉంటారు. పాములకు సంబంధించిన కదలికలు ఎలా ఉన్నాయి. ఇక వాటి జీవన శైలి ఎలా ఉంటుంది అన్న విషయం తెలుసుకోవడానికి కూడా ఆసక్తి చూపుతూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఒక భారీ అనకొండకు సంబంధించిన వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది.



 సాధారణంగా అనకొండ పేరు చెప్పగానే ప్రతి ఒక్కరు వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ పాము  భారీ సైజులో ఉండడమే కాదు.. మనుషులను అమంత మింగేస్తూ ఉంటుంది. ఇక అలాంటి భారీ అనకొండ తో ఇక్కడ ఒక వ్యక్తి ఆటలు ఆడటం కాస్త అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది అని చెప్పాలి. గ్రీన్ అనకొండ ను పట్టుకొని ఎంతో దగ్గరగా కూర్చున్నాడు సదరు వ్యక్తి. అనకొండ పామును పట్టుకుని లాగుతూ కనిపిస్తూ ఉన్నాడు. అనకొండ ఏకంగా తన చిన్ననాటి స్నేహితుడు అన్న విధంగానే సదరు వ్యక్తి నవ్వుతూ ఉండడం గమనార్హం. ఇది చూసి నేటిజన్స్  మాత్రం వామ్మో ఇలాంటి పనులు అవసరమా అంటూ కామెంట్లు చేస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: