ఒకప్పుడు ప్రజాప్రతినిధులు ఏది చెబితే అది గుడ్డిగా నమ్మేవారు జనాలు . ఈ క్రమంలోనే ప్రజా ప్రతినిధులు చెప్పినట్లుగానే నడుచుకునేవారు అని చెప్పాలి. కానీ ఇటీవల కాలంలో మాత్రం ప్రజాప్రతినిధులు ఏదైనా తప్పు చేస్తున్నారు అని తెలిస్తే ధైర్యంగా తిరగబడటం చేసి ఎదిరిస్తూ ఉన్నారు అని చెప్పాలి. కొన్ని కొన్ని సార్లు అయితే ఇక ఇక ప్రజల్లోకి వెళ్లిన ప్రజా ప్రతినిధులపై దాడులకు పాల్పడుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి.. ఇక ఇలాంటి ఘటన ఏదైనా జరిగింది అంటే చాలు ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.


 ఇప్పుడు ఒక దేశానికి చెందిన మాజీ అధ్యక్షుడికి కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురయింది. ఏకంగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు నిరసనగా రాలి చేస్తున్న సమయంలో దూసుకు వచ్చిన ఒక వ్యక్తి ఏకంగా మాజీ అధ్యక్షుడి మొఖంపై పిడుగులు కురిపించాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విటర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆల్బెనియా మాజీ అధ్యక్షుడు సాలి బెరీషా ఇటీవలే రాజధాని టిరాణాలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలో పాల్గొన్నారు. దేశంలో ముందస్తు ఎన్నికలు జరపాలి అంటూ నిరసన చేస్తున్న ప్రతిపక్ష నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు.


 రోడ్డుపై నడుస్తున్న సమయంలో ఊహించిన విధంగా అనూహ్యమైన ఘటన చోటు చేసుకుంది. ఎర్ర చొక్కా వేసుకుని ఒక వ్యక్తి సెక్యూరిటీని దాటుకుని ఒక్కసారిగా ఇక మాజీ అధ్యక్షుడు వద్దకు వచ్చి ముఖంపై చేత్తో బలంగా గుద్దాడు. దీంతో మాజీ అధ్యక్షుడు బెరీష ఒక్కసారిగా పక్కనే ఉన్న వాళ్లపై పడిపోయాడు. ఇక వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సదరు వ్యక్తిని పట్టుకుని దారుణంగా చేతకబాదారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. ఇక ఈ దాడిలో మాజీ అధ్యక్షుడు కంటి కింద చిన్న దెబ్బ తగిలింది అన్నది తెలుస్తుంది. ఇక పోలీసులు అదుపులో ఉన్న నిందితుడు  హింసాత్మక ఘటనలకు పాల్పడ్డాడని.. మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నట్లు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: