
రోజు రోజుకు ఇలాంటి ఘటనలు పెరిగి పోతున్న నేపథ్యం లో.. ఇలా అనుచితం గా ప్రవర్తించిన ప్రయాణికుల పట్ల కఠినం గా వ్యవహరించాలి అంటూ భారత విమానయాన నియంత్రణ విభాగం ఇప్పటికే ఆయా విమానాయన సంస్థలకు ఆదేశాలు జారీ చేయడం కూడా హాట్ టాపిక్ గా మారి పోయింది. ఇకపోతే ఇటీవల వర్జిన్ ఆస్ట్రేలియా విమానం లో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది అని చెప్పాలి. టౌన్స్ వెళ్లే - సిడ్ని విమానం టౌన్స్ విల్లె నుండి టెక్ ఆఫ్ అయిన తర్వాత ఒక ప్యాసింజర్ ఏకంగా అనుచిత ప్రవర్తనతో అందరిని ఇబ్బంది పెట్టాడు.
ఎయిర్పోర్టు సిబ్బందితో గొడవకు దిగాడు అని చెప్పాలి. అయితే పైలట్ జోక్యం చేసుకోవడం తో ఏకంగా పైలెట్ ను సైతం సదరు ప్రయాణికుడు బూతులు తిట్టాడు. కాలర్ పట్టుకుని కొట్ట బోయాడు. దీంతో పైలట్ కి కోపం కట్టలు తెంచుకుంది. నడువ్ అంటూ అతన్ని ఈడ్చుకుంటూ ఎగ్జిట్ డోర్ వరకు తీసుకువెళ్లాడు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించాలని సిబ్బందికి సూచించడంతో ఇక సదరు ప్రయాణికుడు ఒక్కసారిగా భయపడి పోయి అక్కడి నుంచి జారుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారిపోయింది.