సాదరణంగా హోటల్లో కస్టమర్లు ఎప్పుడూ వస్తూ పోతూనే ఉంటారు. ఈ క్రమంలోనే.. పొద్దు పొద్దున్నే టిఫిన్ ఇక మధ్యాహ్నం అయ్యే సరికి లంచ్ ఇక సాయంత్రం సమయంలో భిన్నమైన ఆహార పదార్థాలను  ప్రిపేర్ చేయడానికి ఇక కిచెన్ లో వంట సిబ్బంది మొత్తం ఎప్పుడూ బిజీ బిజీగానే ఉంటారు అని చెప్పాలి. ఎందుకంటే టిఫిన్ పూర్తయ్యేలోపే మధ్యాహ్నం లంచ్ సమయం వస్తుంది. ఇక లంచ్ పూర్తయ్యలోపే కాస్త గ్యాప్ లోనే డిన్నర్ సమయం వస్తుంది. అందుకే ఇక ఎప్పుడూ కస్టమర్లకు ఎక్కడ ఇబ్బంది కాకుండా ఇక అన్ని ప్రిపేర్ చేయడంలో బిజీగా ఉంటూ చకచకా అన్ని పనులు చేసేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఇలాగే వంట సిబ్బంది రోజు లాగానే పనులు చేస్తున్నారు.  ఇలాంటి సమయంలోనే ఒక వింత అనుభవం వారికి ఎదురైంది.


 రోజువారి పనుల్లో బిజీగా ఉన్న సమయంలోనే ఇక వంట గదిలో నుంచి వింత శబ్దాలు వినిపించాయి. మొదట ఆ శబ్దాలను పట్టించుకోలేదు సిబ్బంది. కానీ ఆ తర్వాత ఎందుకో కాస్త వింతగా శబ్దాలు వినిపించడంతో ఏంటా అని చెక్ చేసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే వంట గదిలో ఏకంగా ఐదు అడుగుల పొడవున్న ఒక భారీ నాగుపాము బుసలు కొడుతూ కనిపించింది. దీంతో ఒక్కసారిగా హాడలిపోయారు సిబ్బంది. ఈ ఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. తిరువల్లూరు జిల్లాలోని తిరుత్తని బస్టాండ్ సమీపంలో ఒక హోటల్ వంటగదిలో ఐదు అడుగుల పొడవైన నాగు పాము దూరింది.


ఇక అక్కడ పని చేస్తున్న సిబ్బంది ఆ నాగుపాములు గమనించి ఒక్కసారిగా హడలిపోయారు. ఇక కస్టమర్లను కూడా అప్రమత్తం చేశారు అని చెప్పాలి. వెంటనే ఇక అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అయితే ఇక హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న వారు ఎంతో చాకచక్యంగా ఆ భారీ నాగుపామును పట్టుకున్నారు అని చెప్పాలి. ఇక ఆ తర్వాత పామును తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: