సాధారణంగా ఖడ్గ మృగాలు  చూడటానికి మృదుస్వభావం కలిగిన జంతువులాగానే కనిపిస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఎందుకంటే ఎక్కువగా ఇతర జంతువులతో పోటీ పడటం మానేసి. దాని పని ఏదో అది చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటుంది. కానీ ఖడ్గ మృగానికి కోపం వస్తే మాత్రం ఏ రేంజ్ లో విధ్వంసం సృష్టిస్తుంది. ఇక ఎంతభయంకరంగా దాడి చేస్తుంది అన్నది మాత్రం ఇటీవల కాలంలో కొన్ని వీడియోలు వెలుగులోకి వచ్చిన తర్వాత అందరికీ అర్థమవుతూ ఉంది.


 మొన్నటికి మొన్న సఫారీలకు జంతువులను వీక్షించేందుకు వెళ్లిన టూరిస్టుల వాహనంపై ఒక ఖడ్గమృగం దాడి చేసిన వీడియో ట్విట్టర్ లో ఎంతలా చక్కర్లు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా టూరిస్టుల ప్రాణాలు తీసేసినంత పని చేసింది ఖడ్గమృగం.  అయితే ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోను వెలుగులోకి వచ్చింది. అయితే ఈసారి టూరిస్టులపై కాదు ఏకంగా జనాలపై అతి భయంకర రీతిలో ఖడ్గమృగం దాడికి పాల్పడింది అని చెప్పాలి.  అయితే అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగి ఇక ఖడ్గ మృగాన్ని అదుపు చేసేందుకు ప్రయత్నించారు.


 అయినప్పటికీ అప్పటికే కోపంతో ఊగిపోతున్న ఖడ్గమృగం అటవీశాఖ అధికారులపై కూడా దాడికి దిగింది.  ఈ ఘటనలో ఇక డివిజనల్  అటవీ అధికారి సుశీల్ కుమార్...మరో అధికారి కూడా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన అస్సాంలోని గోల ఘాట్ జిల్లాలో వెలుగు చూసింది. మోహిమ గ్రామంలోకి ఒక ఖడ్గమృగం వచ్చింది. ఇక గుంపుగా ఉన్న కొంత మందిపై దూసుకు  వెళ్లి దాడి చేయాలని ప్రయత్నించింది. కానీ వెంటనే అప్రమత్తమైన జనాలు అక్కడి నుంచి పరుగులు తీశారు.. ఇక అయినప్పటికీ విడిచిపెట్టని ఖడ్గమృగం  వారి వెంట దాడి చేసేందుకు పరుగులు పెట్టింది. ఇక అటవీశాఖ అధికారులకు అక్కడి స్థానికులు సమాచారం అందించగా ఇక వాళ్లు వచ్చి అదుపు చేసేందుకు ప్రయత్నించిన వారిపై కూడా దాడి చేసింది. అయితే ఇక ఇదంతా అక్కడ చెట్టుపై ఎక్కిన ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: