ప్రస్తుతం క్యాబ్ లు, ఓలాలు ఇంకా ర్యాపిడోలు బాగా అందుబాటులోకి వచ్చాయి. ఇంకా చాలా నగరాల్లో పెరిగిపోతున్నాయి. అయితే ఇవి వచ్చాక రిక్షా కార్మికుల జీవితాలు పూర్తిగా సంక్షోభంలో పడ్డాయి. చాలా మంది కూడా తమ రిక్షాలను అమ్మేసుకున్నారు.పాపం రిక్షా నడపడం తప్ప వేరే పని చేయలేని వారు ఇప్పటికీ కూడా అదే పని చేస్తున్నారు. రోజంతా ఎంతగానో కష్టపడినా కూడా కనీసం వారికి వంద రూపాయలు కూడా రాని పరిస్థితి. అలాంటి వారిని చూస్తే ఎవరికైనా కూడా చాలా జాలి వేస్తుంది. కానీ, ఉత్తరప్రదేశ్‌లోని  లక్నోలో ఓ వ్యక్తి రిక్షా కార్మికుడి పరిస్థితి తెలిసినా కూడా ఖచ్చితంగా జాలి వేస్తుంది. పాపం అతనిని కేవలం రూ.20 కోసం మోసం చేసి వెళ్లిపోయాడు. ఇప్పుడు అతడి కథ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇంకా పై ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి లక్నోలోని  జనపథ్ మార్కెట్ దగ్గర రిక్షా పట్టుకుని వెయిట్ చేస్తున్నాడు. అతని రిక్షాలో వచ్చిన ఓ పనికిమాలిన వ్యక్తి జనపథ్ మార్కెట్ దగ్గర దిగి రెండు నిమిషాల్లో వచ్చి డబ్బులు ఇస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.


ఇక ఆ 2 నిమిషాలు కాస్తా.. మొత్తం 20 నిమిషాలు అయ్యాయి. ఇక గంట దాటినా కూడా వాడు రాలేదు. తనకు రావాల్సిన కేవలం రూ.20 కోసం ఆ రిక్షా నడిపే సోదరుడు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇక తనని మోస చేసిన ఆ దుర్మార్గుడు కనబడతాడేమోనని కాసేపు అటూ ఇటూ తిరిగాడు. ఇక ఆ రిక్షా కార్మికుడి వేదనను @raksha_s27 అనే ట్విటర్ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో అతని కథ కాస్తా వైరల్ అయింది.ఇక చాలా మంది ఈ విషయం పై స్పందిస్తున్నారు. ``పేదల శాపం అనేది ఆకాశాన్ని ముక్కలు చేస్తుంది``, ``ఛీ..ఛీ.. ఇలాంటి దారుణమైన మనుషుల మధ్యనా మనం బతుకుతున్నది..?``, ``ఇది ఖచ్చితంగా మానవత్వం పడిపోతున్న స్థాయిని తెలియజేస్తోంది``, ``కేవలం రూ.20 కోసం మరీ ఇంత నీచానికి పాల్పడతారా`` అంటూ నెటిజన్లు ఆ వ్యక్తి పై ఎంతగానో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: