
ఇక ఇలాంటి తరహా వీడియోలు ప్రతి ఒక్కరి మనసును హత్తుకుంటూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఇలాంటి వీడియోనే ఒకటి యూట్యూబ్ వేదికగా వైరల్ గా మారి పోయింది. తన ప్రస్తావానికి సహాయం చేసిన వ్యక్తి పట్ల ఆవు చూపించిన కృతజ్ఞత భావం ప్రతి ఒక్కరిని కూడా ఫిదా చేస్తుంది అని చెప్పాలి. ఆవుకి అప్పుడే చిన్న దూడ పిల్ల పుట్టింది. ఇక ఆవు ప్రసవ వేదన పడుతుంటే.. ఒక వ్యక్తి సహాయం చేశాడు. అయితే ఇలా ప్రసవ వేదన సమయంలో తనకు సహాయం చేసిన వ్యక్తి పట్ల ఆవు ఎంతో అద్భుతమైన భావోద్వేగాలను ప్రదర్శించింది.
అతను చేసిన సహాయానికి కృతజ్ఞతగా అతని చేతులు నుదురు నిమురుతు.. ఆ ఆవు తన అభిమానాన్ని చాటుకుంది అని చెప్పాలి. అంతేకాదు ఆవు దూడకి దుప్పటి కప్పడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఇక అతను తిరిగి దూడను గుడ్డతో శుభ్రం చేస్తుంటే మరల అతను చేతులు నాకుతూ ప్రేమను చాటుకుంది ఆ మూగ జీవి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోవడంతో ఇది ప్రతి ఒక్కరి మనసును హత్తుకుంటుంది అని చెప్పాలి. ఇది ఒక అందమైన బంధం అంటూ నెటిజెన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. కల్మషం లేని ప్రేమానురాగాలు అంటే ఇవేనేమో అంటూ ఎంతోమంది కామెంట్లు చేస్తున్నారు.