తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున శాసనసభ ఎన్నికలు పోలింగ్ జరగబోతోంది.. ఉదయం నుంచి అందుకు సంబంధించిన అప్డేట్లు కూడా వస్తూనే ఉన్నాయి. అయితే ఎన్నికలు జరిగిన ప్రతిసారి కూడా రాష్ట్రవ్యాప్తంగా 70% వరకు పోలింగ్ జరుగుతూ ఉండేది..హైదరాబాదులో మాత్రం 55 శాతానికి మించి ఎప్పుడు ముందుకు వెళ్లలేదట. అయితే హైదరాబాద్ నగరంలో పోలింగ్ శాతాన్ని సైతం పెంపొందించేందుకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం , రాపిడో సంస్థకు ఒక మంచి ఉపాయాన్ని అందించిందట. అందుకోసం పోలింగ్ డేస్ సందర్భంగా స్పెషల్ ప్రోగ్రాములను రూపొందించి ఇందులో భాగంగానే ఫ్రీ రైడ్ షేరింగ్ల చేపట్టడం జరిగిందట



అయితే ఇవాళ ఒక్కరోజు హైదరాబాద్ నగర్ వ్యాప్తంగా 2006 పోలింగ్ బూతులకు సైతం ఉచితంగా రైడ్ అందిస్తున్నట్లు ర్యాపిడో సంస్థ తెలియజేయడం జరిగింది.. రైడ్ షేరింగ్ అనే కార్యక్రమానికి కూడా నిర్వహించి పోలింగ్ శాతాన్ని పెంపొందించే విధంగా విస్తృత ప్రయత్నాలు చేస్తోంది. ర్యాపిడో కెప్టెన్లంతా కూడా ఈరోజు ఉదయం నుంచి అందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఓటు వేయాలనుకునే వారికి ఓటర్లు ర్యాపిడో యాప్ లో రైడ్ కోసం వెంటనే వారి యొక్క పోలింగ్ బూత్ ల వద్దకు బైకులు తీసుకు వెళ్లే విధంగా సదుపాయాన్ని అందిస్తున్నారు.


మరి ర్యాపిడో  ఫ్రీ రైడ్ బుకింగ్ ఎలా వినియోగించుకొని హోటకూ వినియోగించుకోవాలి అంటే..


ముందుగా ర్యాపిడో   బైక్ లేదా టాక్సీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది.

ఆ తర్వాత అందులో లాగిన్ అయిన తర్వాత ఉచిత రైడ్ సేవలను సైతం సెట్ చేసుకోవాలి ఉచిత రైడ్ సేవలలో పోలింగ్ బూత్ ఎక్కడ ఉందో అనే విషయాన్ని టైప్ చేయవలసి ఉంటుంది అనంతరం కూపన్ కోడ్ కూడా చూపిస్తుంది. అక్కడ కూపన్ లో ఉన్నచోట వొట్ నౌ అనే వన్ టైం కోడిని నమోదు చేయవలసి ఉంటుంది. దీంతో మీ ఫ్రీ రైడ్ బుక్ అయినట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి: