మంగళవారం కేరళలో కొత్త కేసులు నమోదు కాలేదట.. కేరళలో 32 మంది ఈ కరోనా వైరస్ నుంచి కోలుకున్నారట .ఇప్పుడు ఇక్కడ ఆక్టివ్ పేషంట్ల సంఖ్య 3096 కి తగ్గింది. మహారాష్ట్రలో అయితే 168 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. తమిళనాడు లో 139 కరోనా యాక్టివ్ కేసులు వెలుగులో ఉన్నట్లుగా వైద్యులు సైతం నిర్ధారించారు.. కర్ణాటకలో 436 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఎక్కువగా కరోనా కేసులు కేరళలో మాత్రమే ఉన్నాయట.. ఇండియాలో గడిచిన 24 గంటలు కోవిడ్ 19 jn.1 కొత్త వేరియంటెడ్ లో మొత్తం 126 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది.
ప్రస్తుతం దేశంలో 4170 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్యశాఖ తెలుపుతోంది.. ఏదీ ఏదేమైనా కరోనా విజృంభించక ముందే మాస్కులు సానిటేరు వాడటం ఎంతో శ్రేయస్కరం అంటూ వైద్యాధికారులు చెబుతున్నారు. గతంలో కూడా ఈ కరోనా బారిన పడ్డ కేసులు సైతం ఎక్కువగా ఉండి చాలామంది ప్రాణాలు సైతం కోల్పోవడం జరిగింది. అందుకే చాలామంది ప్రజలు సైతం కరోనా అంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా పౌష్టికైనా ఆహారాన్ని తినడం మంచిదని నిపుణులు కూడా తెలియజేస్తున్నారు.
మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరు కాస్త డిస్టెన్స్ ని మెయింటైన్ చేస్తూ మాట్లాడడం మరింత మంచిది.. వీటితోపాటు జలుబు దగ్గు జ్వరం వస్తే వెంటనే వైద్యుని సంప్రదించడం చాలా ముఖ్యము..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి