ఈ మధ్యకాలంలో జనాలు అందరిలా రొటీన్ గా జీవితం గడపడం కంటే.. ఏదో ఒకటి కొత్తగా ట్రై చేసి ప్రతిక్షణం జీవితాన్ని ఆస్వాదించాలని అనుకుంటూ ఉంటారు  ఈ క్రమంలోనే కొన్ని కొన్ని ప్రమాదకరమైన విన్యాసాలు చేయడానికి కూడా రెడీ అవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇలాంటి విన్యాసాలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే.. ఇక ఆ వీడియోలు వైరల్ గా మారిపోయి.. అది చూసి అందరు షాక్ అవుతూ ఉంటారు. ఇలా ప్రమాదకరమైన సాహసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కొదవ లేకుండా పోయింది అని చెప్పాలి. ఇక్కడ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి సాహసం గురించే.


 సాధారణంగా సముద్రంలో సొర చేపలు ఎంత ప్రమాదకరమైనవో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సొర చేపలకు మనుషులు కనబడ్డారు అంటే చాలు దాడి చేసి దారుణంగా ప్రాణాలను తీసేస్తూ ఉంటాయి  ఒక్కసారి సొర చేప కన్ను పడింది అంటే దాని నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. అలాంటిది ఇక్కడ ఒక వ్యక్తి సొర చేప కాదు ఏకంగా సొర చేపల గుంపుతోనే సాహసం చేశాడు. ఏకంగా మనిషి రక్తంతో స్నానం చేసి సముద్రంలోకి దిగాడు. సొర చేపలు ఎలా స్పందిస్తాయో అని చూడడానికి ఇలాంటి ప్రయోగం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.


 మాజీ నాసా ఇంజినీర్ మార్క్ రాబర్ట్ ఓ యూట్యూబర్ గా మారాడు. ఆయన యూట్యూబ్ లో పెట్టేందుకు ఒక భయానక ప్రయోగాన్ని చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే బహమాస్ వెళ్లి షాకింగ్ విన్యాసం చేసాడు. ఇక అతనితో పాటు డైవింగ్ నిపుణుడు లింక్ డిప్పల్ కూడా ఉన్నాడు. ఈ ప్రయోగంలో మార్క్ ముందుగా తన రక్తపు చుక్కలను కొన్నింటిని సముద్రంలో పడేసాడు  దాదాపు గంట గడిచిపోయిన షార్క్ జాడ కనిపించలేదు. చేపల రక్తంతో షార్క్ ను ఆకర్షించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే 100కు పైగా సొర చేపలను ఆకర్షించింది. ఈ క్రమంలోనే చేపల రక్తం సహా అటు మానవ రక్తంలో కూడా అతను స్నానం చేసి తర్వాత బోన్ లో బందీ అయ్యాడు. ఇక అదే బోనులో సముద్రంలోకి దిగాడు. తర్వాత పరిస్థితి భయానకంగా మారింది. వారి చుట్టూ సొర చేపల గుంపు చేరి పంజరం పై దాడి చేసింది. దీంతో వారు  మొదట భయపడ్డారు. వారు బోనులో ఉన్నారని భావించి కాస్త భయం పోగొట్టుకున్నారు. ఇక ఈ సాహసాన్ని చూసి అటు నేటిజన్స్ కూడా తెగ భయపడిపోతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: