ప్రపంచ దేశాల్లోని చాలామంది ఎంజాయ్ చేయడం కోసం దుబాయ్ కి వెళ్తారు.. ప్రపంచంలోనే అద్భుతమైన పర్యాటక ప్రాంతం అంటే అందరికీ గుర్తుకు వచ్చేది దుబాయ్ పేరు మాత్రమే. ఇలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం లో ఉండే దుబాయిలో సెక్స్ రాకెట్ అనేది పెద్ద దందాగా నడుస్తోంది.. దుబాయ్ లో ఈ వ్యవహారంలో పాల్గొనే అమ్మాయిలు వారి ఇష్టపూర్వకంగా ఇందులో పని చేయరట. కొంతమందిని వివిధ పనుల పేరుతో అక్కడికి తెప్పించుకొని  చివరికి వారిని బంధించి వారితో సెక్స్ చేయిస్తారని  తాజాగా బయటకు వచ్చింది. ఇతర దేశాల అమ్మాయిలకు డబ్బు ఆశ చూపి మార్కెట్స్, హోటల్స్ లో ఉద్యోగం ఇప్పిస్తామని ఎక్కువ జీతం ఉంటుందని ఆశ చూపి వారిని అక్కడికి రప్పించుకొని చివరికి  గుట్టు చప్పుడు కాకుండా సెక్స్ వర్క్ లోకి దించేస్తారట. ఎక్కువ మాట్లాడితే వారిని చంపడం, ఆత్మహత్యగా చిత్రీకరించడం లాంటివి కూడా జరుగుతాయట. 

అయితే చాలామంది అనుకునేది అక్కడ ఉండే మహిళలు  సెక్స్ లైఫ్ కు అలవాటు పడి ఎక్కువగా డబ్బులు సంపాదిస్తారని వారు వారి ఇష్టపూర్వకంగానే చేస్తారని అంటారు. ఇలా కొంతమంది ఉండొచ్చు కానీ, అందులో చాలామంది అమ్మాయిలకు ఉద్యోగాల పేరిట ఈ రొంపిలోకి దించి వారిని  ఇబ్బందులకు గురి చేస్తారనే ఆరోపణలు బయటికి వచ్చాయి. ముఖ్యంగా అమ్మాయిలు దుబాయ్ వెళ్లిన తర్వాత  వారి వద్ద ఉన్న పాస్పోర్ట్స్ తీసుకొని , వివిధ హోటల్స్ లో ఉంచి వారి దగ్గరికి క్లైంట్ లను పంపించి వారికి నచ్చినట్టు సెక్స్ చేయాలని ప్రేరేపిస్తారట. ఈ క్రమంలో ఎంతో మంది అమ్మాయిలు మరణించారని, కనీసం వారు ఎలా మరణిస్తున్నారో కూడా ఇక్కడి పోలీసులు చెప్పలేదని తెలుస్తోంది. ముఖ్యంగా చాలామంది యువతుల మరణాలను ఆత్మహత్యగా చిత్రీకరించి వారు ఉండే గదుల్లో మత్తు పదార్థాలు పెట్టి  బిల్డింగ్ పై పడినట్టు చిత్రీకరణ చేశారు.

 ముఖ్యంగా ఈ యువతులను  సెక్స్ చేసే సమయంలో విపరీతమైనటువంటి  ఇబ్బందులకు గురిచేస్తారని, ఆ పని చేయడానికి వచ్చినటువంటి పురుషులు మహిళను అత్యంత కిరాతకంగా చూస్తూ మలమూత్ర విసర్జన చేసి అది తినమని కూడా ప్రేరేపిస్తారట. ఒకవేళ వారు చెప్పినట్టు చేయకపోతే విపరీతంగా కొట్టి  హింసిస్తారట. ఎవరైనా ఎదురు తిరిగి మాట్లాడితే ఎవరైతే వీరిని ఇక్కడికి పంపారో వారికి వీళ్ళు అప్పు ఉన్నట్టు చిత్రీకరించి అప్పు తీర్చే వరకు వెళ్ళేది లేదని భయభ్రాంతులకు గురి చేస్తారట. అంతేకాదు ఈ సెక్స్ రాకెట్ నడిపే వ్యక్తులు ఆర్థికంగా సామాజికంగా బలంగా ఉండి, అక్కడి పోలీసులను కూడా కవర్ చేస్తూ వారి దందాలు నడిపిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సెక్స్ లో పాల్గొనే మహిళలపై కొంతమంది పురుషులు జాత్యాహంకారం చూపిస్తారని తెలుస్తోంది.

ముఖ్యంగా నల్లజాతి మహిళలను వారు  కొడుతూ వాళ్లు ఏడుస్తూ అరిస్తే చాలా ఆనందపడతారని, ఒకవేళ మహిళలు దుబాయ్ పోలీసుల సాయం కోసం ప్రయత్నించినప్పుడు  కనీసం సపోర్ట్ కూడా లభించడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సెక్స్ రాకెట్ నడిపించే వ్యక్తులకు సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పటివరకు ఎక్కడ లభ్యం కాలేదని తెలుస్తోంది. మధ్యతరగతి మహిళలను  ఉద్యోగం ఆశ చూపి అక్కడికి తెప్పించి  ఈ సెక్స్ రొంపి లోకి దింపి తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసి చివరికి ఎక్కువ మాట్లాడితే చంపి కనీసం ఆ కేసు కూడా లేకుండా చేసే సత్తా ఈ దందా నడిపే వారికి ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే దుబాయ్ లో పని కోసం వెళ్లే కొంతమంది యువతులు ఎక్కడికి వెళ్తున్నామనేది క్లియర్ గా తెలుసుకొని వెళ్లడం మంచిదని నిపుణులు  అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: