
ఆమె మాటలు నమ్మి అమాయకుడైన యువకుడు రష్మీ ఇంటికి వెళ్లడం ప్రారంభించాడు. మొదట్లో ఇది సాధారణమనే భావించిన అతడు, తాను పెద్ద మోసానికి గురవుతున్నానని గ్రహించలేకపోయాడు. ఒక రోజు ఇద్దరూ రొమాంటిక్‌గా మెలుగుతున్న సమయంలో, ఇంట్లోనే దాక్కున్న రష్మీ భర్త అకస్మాత్తుగా బయటకు వచ్చాడు. ఆ దృశ్యాన్ని తన సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేయడం ప్రారంభించాడు. తరువాత ఆ భర్త తన భార్యతో కలిసి ఆ యువకుడిని భయపెట్టాడు. “నీ దగ్గర ఉన్న ఫోన్, డబ్బు ఇవన్నీ ఇప్పుడే ఇవ్వాలి, లేనిపక్షంలో ఈ వీడియో బయటకు పెడతాం” అని బెదిరించాడు. భయపడి యువకుడు తన వద్ద ఉన్న ఫోన్, డబ్బు వారికిచ్చేశాడు. అయితే, ఇంతటితో ఆగలేదు.
వారు యువకుడిని భయపెట్టి చేతులు కట్టి వేలాడదీశారు. అతని బట్టలు తీసివేసి అతి దారుణంగా చిత్రహింసలు పెట్టారు. ప్రైవేట్ పార్ట్‌పై 26 స్టాప్లర్ పిన్నులతో గుచ్చి పైశాచిక ఆనందం పొందారు. అంతేకాకుండా అతని చేతి గోళ్లను కత్తిరించారు. తీవ్రమైన నొప్పి తట్టుకోలేక యువకుడు గట్టిగా కేకలు వేయసాగాడు. అతని కేకలు బయటికి వినపడతాయని భయపడ్డ దంపతులు అతని నోటికి గుడ్డ కట్టేశారు. తరువాత ఎవ్వరూ లేని ఓ ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ వదిలిపెట్టారు. నొప్పి తట్టుకోలేక యువకుడు అక్కడే అరుస్తూ ఉండగా, అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి ఆ శబ్దాలు విని అతన్ని గమనించాడు. వెంటనే అతన్ని దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాడు.
అసుపత్రిలో చికిత్స పొందిన యువకుడు జరిగిన సంగతులన్నీ బయటపెట్టాడు. పోలీసులు ఫిర్యాదు స్వీకరించి వెంటనే కేసు నమోదు చేసి ఆ దంపతులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారిద్దరూ జైలులో ఉండగా, ఈ కేసుపై విచారణ జరుగుతోంది. పోలీసుల దర్యాప్తులో మరో సంచలన విషయం బయటపడింది. రష్మీ అనే ఈ మహిళ ఒక్క ఈ యువకుడినే కాకుండా, ఇలాగే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన మరికొంత మంది యువకులను కూడా మోసం చేసి, డబ్బు, వస్తువులు గుంజేసిందని తెలిసింది. అంటే ఇది ఒక రకమైన "హైటెక్ మోసం" అని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటన వెలుగులోకి రాగానే సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. చాలామంది “ఇలాంటి క్రూరత్వం ఎలా సాధ్యమవుతుంది?”, “సోషల్ మీడియా వల్ల ఎంతమంది అమాయకులు మోసపోతున్నారు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం యువకులు కూడా జాగ్రత్తగా ఉండాలని, తెలియని వ్యక్తుల ఆకర్షణలకు లోనవ్వకూడదని హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద, ఈ ఘటన సమాజానికి ఒక పెద్ద హెచ్చరికగా మారింది. కలియుగంలో మానవత్వం ఎక్కడికి పోయిందో అనే ప్రశ్నకు ఇది మరో ఉదాహరణగా నిలిచింది.