హిందూ సంప్రదాయం ప్రకారం..  కొన్ని పద్ధతులను తప్పకుండా పాటిస్తూ ఉంటారు. కొన్ని నమ్మకాలు బలంగా పాతుకుపోయి ఉంటాయి. మరీ ముఖ్యంగా ఆదివారం + అమావాస్య వస్తే ఆ రోజు కొన్ని పనులు చేయకూడదని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. రేపే ఆదివారం + అమావాస్య కూడా కావడంతో, ఈ సమయంలో కొన్ని పనులు చేయకూడదు, కొన్ని వస్తువులు ఇంటికి తీసుకురావకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటి వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే దరిద్ర దేవతను ఆహ్వానించినట్లవుతుందని, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబంలో గొడవలు వస్తాయని పెద్దలు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ఆదివారం + అమావాస్య వచ్చిన రోజున ఈ రెండు వస్తువులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ కొనరని ఒక సంప్రదాయం ఉంది. ఆ వస్తువులు ఏంటీ? ఎందుకు కొనకూడదు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం...!


సాధారణంగా అమావాస్యనాడు కొత్త వస్తువులు కొనడానికి చాలా మంది ఇష్టపడరు. కొందరు అమావాస్యను నెగిటివ్‌గా, ఒక చెడు రోజుగా పరిగణిస్తారు. మరీ ఆదివారం అమావాస్య వస్తే, దాన్ని ఒక పెద్ద అపశకునంగా భావిస్తారు. అందుకే మన పూర్వీకులు, పెద్దలు ఆ రోజున రెండు వస్తువులు ఎట్టి పరిస్థితుల్లోనూ కొనరాదని చెబుతూ వచ్చారు. ఆ రెండు వస్తువులు ఉప్పు మరియు నువ్వులు. ప్రతి ఇంట్లోను ఉప్పును లక్ష్మీదేవిగా భావిస్తారు. ముఖ్యంగా శుక్రవారం రోజున ఉప్పును బయటికి ఇవ్వకూడదని చాలా కఠినంగా పాటిస్తారు. ఎవ్వరు అడిగినా సరే అస్సలు ఉప్పు ను గడప దాటనివ్వరు.




అలాగే నువ్వులను అమావాస్య రోజున కొనకూడదట . ఇది శనిదేవునికి సంబంధించినవిగా భావిస్తారు. ఆదివారం అమావాస్య నాడు నువ్వులు కొంటే, శనిదేవుని ఇంటికి ఆహ్వానించినట్లవుతుందని పండితులు చెబుతున్నారు. తెలిసి కొన్నా తెలియక కొన్న..ఇది చాలా తలనొప్పులు ఇంటికి తీసుకొస్తుందని పండితులు చెప్తున్నారు. అలా చేస్తే ఇంటి ప్రశాంత వాతావరణం దెబ్బతింటుందని, భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వస్తాయని నమ్మకం ఉంది. అందుకే ఇప్పటికీ చాలామంది పెద్దలు ఈ ఆచారాన్ని నమ్ముతూ ఫాలో అవుతున్నారు. ఈ రెండే కాదు..చెప్పులు,చీపుర,చాట,కర్పూరం, మిరప్పొడి ఇలాంటి వి కూడా ఆదివారం అమావాస్య నాడు కొనకూడదట..!!



గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కొంతమంది పండితులు చెప్పిన ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని ఎంతవరకు విశ్వసించాలి అనేది పూర్తిగా పాఠకుల వ్యక్తిగత అభిప్రాయం అని గుర్తుంచుకోండి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: