
కానీ తాజాగా జరిగిన ఈ ఘటన మాత్రం పూర్తిగా వేరుగా మారింది. ఒక యువతి తన కోపాన్ని అదుపులో పెట్టుకోలేక తోటి మహిళా ప్రయాణికులపై పెప్పర్ స్ప్రే దాడి చేసింది!సాక్షుల ప్రకారం — సంఘటన కోల్కత్తాలోని సీల్డ్ రైల్వే స్టేషన్ దగ్గర జరిగింది. ఒక మహిళ ట్రైన్ ఎక్కింది. అయితే ఆమెకు సీటు దొరకలేదు. మొదట కొంతసేపు ఓపికగా నిలబడి ఉన్నా, తర్వాత కోపంతో ముఖం చిటపటలాడింది. తనతో ఎవరూ సీటు ఇవ్వడం లేదని చిరాకు వేసింది. ఆ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.అవతల ఉన్న ప్రయాణికులను హెచ్చరిస్తూ ఆమె తన హ్యాండ్ బ్యాగ్ నుంచి పెప్పర్ స్ప్రే బాటిల్ తీసి బయటకు తీశింది. వెంటనే చుట్టూ ఉన్న వారిమీదే స్ప్రే చేయడం ప్రారంభించింది. ఒక్కసారిగా కంపార్ట్మెంట్ అంతా ఘాటైన వాసనతో నిండిపోయింది. చాలా మంది ప్రయాణికులు దగ్గు, ఉబ్బసం, కళ్ల దురదతో బాధపడటం ప్రారంభించారు. కొన్ని చిన్న పిల్లలు కూడా చిందరవందరగా ఏడవడం మొదలుపెట్టారు.
ఇంతలో మరో మహిళ జోక్యం చేసుకొని ఆ యువతిని ఆపడానికి ప్రయత్నించింది. ఆమెను నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. కానీ పక్కనే ఉన్న మరో మహిళ ఆ పరిస్థితిని మరింత రగిలించింది. ఇద్దరి మధ్య ఘర్షణ తారస్థాయికి చేరింది. కోపంతో రెచ్చిపోయిన ఆ యువతి మిగతా ప్రయాణికులపై మరింత పెప్పర్ స్ప్రే చేయడం ప్రారంభించింది. ఈ ఘాటైన వాసన వల్ల కంపార్ట్మెంట్ లో ఉన్న ప్రయాణికులు బయటకు పారిపోవాల్సి వచ్చింది. కొందరు అస్వస్థతకు గురయ్యారు. చివరికి ట్రైన్ ఆగిన వెంటనే ప్రయాణికులు ఆ యువతిని చుట్టుముట్టి బాగా తిట్టిపోశారు. రైల్వే సిబ్బంది కూడా వెంటనే జోక్యం చేసుకున్నారు. ఆ యువతి క్షమాపణలు చెప్పి తాను ఆవేశంలో చేసింది అని చెప్పినప్పటికీ, రైల్వే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
ఇదంతా ప్రయాణికులలో ఒకరు వీడియో తీయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో పెద్ద చర్చగా మారింది. నెటిజన్లు ఆ మహిళ ప్రవర్తనపై మండిపడుతున్నారు.“బుద్ధి లేదా?”, “నీ కోపం తగలెయ్య ..ఇంత నిర్లక్ష్యం ఎందుకు?”..“పెప్పర్ స్ప్రే ఫ్రీ అనుకున్నావా?”..“ఇలాంటి వాళ్ల వల్లనే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో భయం పెరుగుతోంది!”అంటూ నెటిజన్లు ఘాటు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రైల్వే పోలీసులు ఆ ఘటనపై పూర్తి విచారణ చేపట్టారు. ఆ యువతి ఎందుకు అలా ప్రవర్తించింది, అన్న దానిపై దర్యాప్తు జరుగుతోంది. ఈ సంఘటన మరోసారి నిరూపించింది — సోషల్ మీడియాలో ఒక్క చిన్న తప్పు కూడా ప్రపంచం మొత్తానికి చేరిపోవడానికి ఒక క్లిక్ చాలు.