
మహిళను దగ్గరకు లాగి లిప్‌లాక్ చేసిన దృశ్యాలు స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. ఆ సంఘటన లైవ్ వీడియో సెషన్‌లో ఉన్న అందరికీ కనిపించడంతో మిగతావారు షాక్‌కు గురయ్యారు. కొందరు వెంటనే ఆయనకు ఫోన్ చేసి అలర్ట్ చేసినట్లు సమాచారం. కానీ అప్పటికే ఆ ఘటన రికార్డ్ అయిపోయి, సోషల్ మీడియాలోకి లీక్ అయ్యింది.ఇప్పుడు ఆ వీడియో అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలో వైరల్‌గా మారిపోయింది. ఎవరు చూసినా నోరెళ్లబెడుతున్నారు. న్యాయవ్యవస్థలో ఉన్న ఒక వ్యక్తి ఇలా ప్రవర్తించడం చాలా దిగజారిపోయిన చర్య అని వ్యాఖ్యానిస్తున్నారు.
“ఇలాంటి వాళ్ల వల్లే మంచి జడ్జిలకు కూడా చెడ్డ పేరు వస్తుంది”, “ఒకరి తప్పు అందరి మీద మచ్చలా పడకూడదు”, “న్యాయవ్యవస్థ పట్ల ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే పనులు ఇవి” అంటూ కొందరు మండిపడుతున్నారు.ఇక సోషల్ మీడియాలో ఈ వీడియోపై చర్చలు, కామెంట్లు, మీమ్స్ వర్షంలా కురుస్తున్నాయి. కొందరు ఇది నకిలీ వీడియో అని చెబుతుంటే, మరికొందరు నిజమైన వీడియో అని వాదిస్తున్నారు. కానీ అధికారికంగా ఎలాంటి స్పష్టత వెలువడలేదు.ఏదేమైనా, ఆ వీడియోతో ఇప్పుడు జడ్జి ప్రవర్తన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. న్యాయవ్యవస్థకు గౌరవం ఇచ్చే వారు కూడా ఈ ఘటనను చూసి తీవ్ర నిరాశకు గురవుతున్నారు. “పదవులు ఉన్నంత మాత్రాన సంయమనం ఉండాలనే అర్థం చేసుకోవాలి” అని నెటిజెన్లు చెబుతున్నారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో హాట్ టాపిక్‌గా మారింది.