“పెళ్లి చేసి  చూడు… ఇల్లు కట్టి చూడు” — అనే పాత సామెత ఇప్పటికీ నూటికి నూరుపాళ్లు నిజమేననిపిస్తుంది. ఎందుకంటే మన దేశంలో పెళ్లిళ్ల విషయంలో కొనసాగుతున్న ట్రెండ్ ఈ మాటకు మరింత బలం చేకూరుస్తోంది.ఒకప్పుడు “ఆకాశమంత పందిరి… భూదేవి అంత పీట” అని చెప్పుకునే రోజులుండేవి. అయితే ఈనాటి పెళ్లిళ్లు ఆ పాత మాటలను కూడా మించి పోయాయి. కోట్ల రూపాయల ఖర్చులతో, అబ్బురపరిచే హంగు ఆర్భాటాలతో, విలాసవంతమైన వేడుకలతో నేటి వివాహాలు జరుగుతున్నాయి.


నిశ్చితార్థం నుంచి మొదలుకొని ప్రీ-వెడ్డింగ్ ఫోటో షూట్లు, ఖరీదైన డ్రెస్‌లు, డైమండ్ నగలు, లగ్జరీ రిసార్టుల్లో జరిగే వేడుకలు, పందిట్లో అమర్చే భారీ LED స్క్రీన్లు, డ్రోన్ కెమెరాల కవరేజ్ — ఏదీ తగ్గడం లేదు. భోజనాల విభాగం కూడా రాజభోగంగా ఉంటుంది. ఇలా చేయకపోతే ‘ఇది మధ్యతరగతి పెళ్లి’ అని చెప్పడం కష్టంగా మారింది.ఇంతలో తాజాగా ఒక పెళ్లికొడుకు పెట్టిన 10 డిమాండ్లు మాత్రం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. పెళ్లిళ్ల సీజన్ మొదలయ్యే ఈ సమయంలో ఆ కోరికలు అందర్నీ ఆలోచింపజేస్తున్నాయి.మన దేశంలో కట్నం తీసుకోవడం చట్టరీత్యా నేరం. అయినప్పటికీ “గిఫ్ట్‌లు”, “కానుకలు”, “ఒప్పందాలు” అనే పేర్లతో ఆచరణలో మాత్రం పెద్ద మొత్తంలో లావాదేవీలు జరుగుతూనే ఉన్నాయి. అబ్బాయి కుటుంబం కోరిన వాటిని తీర్చేందుకు అమ్మాయి కుటుంబం శక్తి మేరకు కష్టపడుతుంది. తమ పిల్లల పెళ్లి సంతోషంగా జరగాలని భావిస్తూ అప్పులు చేసినా వెనుకాడరు.



అయితే ఈ ప్రత్యేకమైన వరుడు మాత్రం “కట్నం వద్దు” అని చెప్పి, తనకు కావాల్సిన 10 కోరికలు మాత్రమే పెట్టాడు. కానీ ఆ కోరికల జాబితా వినగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఈ వరుడి ఆలోచన కొందరికి స్ఫూర్తిదాయకంగా, మరికొందరికి ఆలోచనీయంగా మారింది.

*ప్రీ-వెడ్డింగ్ షూట్ వద్దు: ప్రీ-వెడ్డింగ్ షూట్ చేయకూడదు.

*వస్త్రధారణ: లెహంగా బదులు చీర ధరించాలి.

*సంగీతం: సంప్రదాయ సంగీతాన్ని మాత్రమే ఉపయోగించాలి.

*దండలు: దండలు మార్చుకునేటప్పుడు ప్రశాంతంగా ఉండాలి.

*పూజారి: పూజారి చేసే కార్యక్రమాన్ని ఎవరూ ఆపకూడదు.

*ఫోటోగ్రఫీ: ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు జోక్యం చేసుకోకూడదు.

*ఫోజులు: అభ్యంతరకరమైన పోజులు అడగకూడదు.

*ప్రదర్శన: వేదికపై కిస్సులు లేదా హగ్గులు ఉండకూడదు.

*సమయం: పెళ్లి పగటిపూట జరగాలి.

*వదులుకోవలసినవి: ఇది పాత తరానికి సంబంధించినది కాబట్టి, కట్నం వద్దని సున్నితంగా తిరస్కరించాలని సూచించాడు.

దీని పై చాలా మంది పాజిటివ్ గా రిప్లై ఇస్తున్నారు. ఇది చాలా బాగుంది అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: