1942లో రెండో ప్రపంచ యుద్ధం సమయంలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఆ కాలంలో భయంతో వణుకుతున్న ప్రపంచం మధ్యలో ప్రేమ అనే కొత్త యుద్ధాన్ని వీరు ప్రారంభించారు — కానీ ఈ యుద్ధం గెలిచినదే! ప్రపంచ రికార్డులను నమోదు చేసే సంస్థలు వీరిని ‘Oldest Living Married Couple’గా గుర్తించాయి. వారి జీవిత ప్రారంభం అంత తేలిక కాదు. ఎలీనర్ ఒక పాఠశాల టీచర్, లైల్ ఇంజినీర్. ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ ఒత్తిడులు ఎదురైనా, వారు చేతులు వదలలేదు. ఎలీనర్ చెబుతుంది, “మేమిద్దరం ఎప్పుడూ ఒకరినొకరిని మార్చాలని కాదు, అర్థం చేసుకోవాలని ప్రయత్నించాము.” అదే వారి బంధానికి పునాది అయింది. చిన్న గొడవలు జరిగినా అవి ఎప్పుడూ పెద్దవిగా మారలేదు. లైల్ నవ్వుతూ చెప్పిన మాట — “నాకు చివరి మాట ఎప్పుడూ ఉండేది... ‘అవును, ప్రియమైనా’.” ఈ ఒక్క మాటలోనే 83 ఏళ్ల ప్రేమ తాత్పర్యం దాగుంది.
ఇంతకుముందు ఈ రికార్డు బ్రెజిల్‌కు చెందిన మనోయల్–మరియా లారెన్ జంట పేరుమీద ఉండేది. వారు 85 సంవత్సరాల పాటు కలసి జీవించారు. కానీ ఇప్పుడు ఆ స్థానం ఎలీనర్–లైల్ దంపతులకు దక్కింది. నేటి కాలంలో ప్రేమ అనేది లైక్, రిప్లై, మెసేజ్‌ల మధ్యే చిక్కుకుపోయింది. చిన్న అపార్థం వచ్చినా బంధాలు విరిగిపోతున్నాయి. కానీ ఎలీనర్–లైల్ గిట్టెన్స్ మనకు చెబుతున్న పాఠం ఒక్కటే — నిజమైన ప్రేమ అంటే సహనం, అర్థం చేసుకోవడం, గౌరవం. వయస్సు పెరిగినా ప్రేమ తగ్గదు, గౌరవం ఉన్న చోటే బంధం నిలుస్తుంది. ప్రపంచ రికార్డుల్లో వీరి పేరు నిలిచిపోయినా, వారి ప్రేమ మాత్రం ప్రతి మనసులో చిరస్థాయిగా నిలిచిపోయింది. నేటి యువతకు ఈ జంట ఒక స్ఫూర్తి — ప్రేమ తాత్కాలికం కాదు, జీవితాంతం నడిచే ప్రయాణం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి