డాక్టర్లను దేవుళ్ళతో పోలుస్తారు.. హాస్పిటల్ కి వచ్చిన రోగులకు చికిత్స చేసి వారు ప్రాణాలతో ఇంటికి వస్తున్నారంటే అదంతా డాక్టర్ల వల్లే. అయితే అందరు డాక్టర్లలోనూ మంచి వాళ్ళు ఉండరు.. అందరి డాక్టర్లలోను చెడ్డవాళ్ళు ఉండరు. కొంతమంది అలా కొంతమంది ఇలా ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో డాక్టర్స్ ఎలా తయారయ్యారో ఈ ఒక్క ఉదాహరణ చూస్తే అర్థమవుతుంది. దెబ్బ తగిలిందని ఓ అబ్బాయిని హాస్పిటల్ కి తీసుకువెళ్లగా.. డాక్టర్ దెబ్బ మీద ఫెవిక్విక్ పోసి వైద్యం చేశాడు.దీంతో ఆ అబ్బాయి నొప్పితో విలవిల్లాడంతో చివరికి వేరే హాస్పిటల్ కి తరలించారు. ఇక విషయంలోకి వెళ్తే.. ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ లో జస్పిందర్ సింగ్ అనే వ్యక్తి కుమారుడు ఆడుకుంటూ ఆడుకుంటూ టేబుల్ కి గుద్దుకున్నాడు. దాంతో నుదుటిపై గాయం కావడంతో వెంటనే జస్పిందర్ సింగ్ తన కుమారుడిని ఎత్తుకొని భాగ్యశ్రీ హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. 

ఇక బాబు నుదుటికి గాయపడంతో రక్తం ఎక్కువగా వచ్చింది.అయితే రక్తం ఆపడానికి ఎవరైనా కట్టు కడతారు.దెబ్బకు ఆయింట్మెంట్ ఇస్తారు. కానీ ఈ డాక్టర్ మాత్రం రక్తం ఆపేందుకు గాయం మీద ఫెవిక్విక్ పోశాడు. ఫెవిక్విక్ ఎంత డేంజరో చెప్పనక్కర్లేదు.అలాంటి ఫెవిక్విక్ ని నేరుగా గాయం మీదే పోసేసరికి బాలుడు నొప్పితో విలవిల్లాడిపోయాడు. దాంతో ఆ దంపతులు వెంటనే మరో హాస్పిటల్ కి తరలించి కుమారుడికి వైద్యం అందించారు. అలా నొప్పితో విలవిల్లాడిన పిల్లాడు గాయం పై ఫెవిక్విక్ పోయడంతో ఆ ఫెవిక్విక్ ని తొలగించి శుభ్రం చేయడానికి అక్కడి డాక్టర్లకు దాదాపు 3 గంటల సమయం పట్టింది.

మూడు గంటల పాటు కష్టపడి గాయాన్ని శుభ్రం చేసి నాలుగు కుట్లు వేశారు. అలా గోరంత గాయాన్ని డాక్టర్ కొండంత గాయం చేశారు. ఫెవిక్విక్ పోస్తే స్కిన్ అతుక్కుంటుంది అనుకున్నాడో ఏమో తెలివి తక్కువ పనిచేసి బాలుడి నీ మరిత బాధపెట్టాడు. ఇక ఈ విషయాన్ని బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు చెప్పి కేసు పెట్టడంతో ఆ డాక్టర్ పై కేసు నమోదు అయింది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ గా మారడంతో బాలుడు ఏమైనా వస్తువు అనుకున్నావా..విరిగిపోతే అతుకు పెట్టడానికి ఫెవిక్విక్ పోసావు.. ఎంబిబిఎస్ చదివే డాక్టర్ అయ్యావా లేక దొంగ సర్టిఫికెట్లతో డాక్టర్ వృత్తి లోకి వచ్చావా అంటూ మండిపడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: