అంతా సాఫీగా సాగిపోతుంది అనుకున్న మూమెంట్ లో బస్సు ఆళ్లగడ్డ సమీపంలోని పేరాయపల్లెమెట్ట ప్రాంతానికి చేరుకునేసరికి ఈ భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. ముందుగా బస్సు డ్రైవర్ ముందుకు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టగా, వెంటనే బస్సు వెనుక నుంచి వస్తున్న మరో లారీ బస్సును ఢీకొట్టింది. ఈ రెండు వరుస ఢీకొట్టుడుల వల్ల బస్సు ముందు–వెనుక భాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అసలు గుర్తు పట్టలేనంతగా నుజ్జు నుజ్జు అయిపోయాయి.
ఈ ప్రమాదంలో బస్సు వెనుక భాగంలో కూర్చున్న ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడి సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మరో డజను మందికి పైగా ప్రయాణికులు గాయపడగా, వారిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. క్షతగాత్రులను మూడు అంబులెన్సుల సహాయంతో ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆళ్లగడ్డ పోలీసులు అక్కడికి చేరుకొని రక్షణ చర్యలు చేపట్టారు. బస్సు మరియు లారీని పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ప్రమాదం తీవ్రత కారణంగా ప్రాంతంలోని ప్రజల్లో భారీ ఆందోళన నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు సమగ్ర విచారణ జరుపుతున్నారు. నిద్ర మత్తులో ఆ డ్రైవర్ ఫాస్ట్ గా రావడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉండచ్చు అంటున్నారు జనాలు..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి