ఇటీవల అలాంటి సంఘటన సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. పాపం ఓ కోతి.. పాము పట్టులో చిక్కుకొని ప్రాణాలతో బయటపడేందుకు నానా ప్రయత్నాలు చేస్తూ విలవిలలాడుతోంది. అరుస్తోంది… చుట్టూ చూస్తోంది .… కానీ పైథాన్ దానిని బలంగా చుట్టేసి, వేటగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది. .ఆ కోతి ఎవ్వరైనా నన్ను కాపాడతారా..? అని ఎదురుచూస్తుంది. ఈ భయంకర దృశ్యం చూస్తున్న ఒక వ్యక్తి, ఆ కోతిని కాపాడాల్సింది పోయి వీడియో తీయడానికే ప్రాధాన్యం ఇచ్చాడు. చిన్న ప్రాణం కోసం పోరాడుతున్న ఆ కోతికి సహాయం చేయకుండా, ఆ దారుణాన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీడియో బయటకు వచ్చిన కొన్ని సెకండ్లలోనే వైరల్ అయిపోయింది ..
అయితే ఈ వీడియోపై పాజిటివ్ కంటే నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. “బుద్ధుందా? పాపం కోతి ఎంత బాధపడుతుందో కనిపించడంలేదా?”, “సహాయం చేయాల్సింది పోయి వీడియో తీయడం ఏంటి?” అంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలతో పోరాడుతున్న ఒక జీవికి సహాయం చేయడానికి కూడా సమయం లేకపోతే ఈ ప్రపంచం ఎటు పోతోందని ప్రశ్నిస్తున్నారు .. “మానవత్వం మంటకలిసిపోయింది” అంటూ ఘాటుఘాటుగా స్పందిస్తున్నారు. .
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి