జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం సాధించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కొందరికి సులభంగా విజయం సొంతమైతే కొందరు ఎంత కష్టపడినా విజయం సాధించలేరు. జీవితంలో విజయం సాధించాలంటే మనం ఎలాంటి పదాలు వాడాలో తెలియడంతో పాటు ఎలాంటి పదాలు వాడకూడదో కూడా తెలియాలి. అప్పుడే సులభంగా చేపట్టిన పనులలో విజయం సాధించవచ్చు. మనం వాడే పదాల వల్లే అవతలి వ్యక్తులకు మనపై ఒక స్థిరమైన అభిప్రాయం ఏర్పడుతుంది. 
 
మనం ప్రతిరోజు వాడే పదాలు మనతో పాటు ఇతరులను కూడా ప్రభావితం చేయగలవు. అలా వాడే పదాలలో ఏ పదాలు మనకు నష్టం చేకూరుస్తాయో ముందుగా తెలుసుకోవాలి. జీవితంలో సక్సెస్ సాధించిన వారు ఎప్పుడూ కొన్ని పదాలు వాడరు. ముఖ్యంగా ఐదు పదాలు వాడకపోతే జీవితంలో చేపట్టే ఏ పనిలోనైనా సక్సెస్ సాధించే అవకాశాలు ఎక్కువవుతాయి. జీవితంలో వీలైనంత వరకు "కానీ" అనే పదం వాడకూడదు. 
 
ఆ పదం నెగిటివ్ గా అనిపిస్తుంది. ఆ పదం బదులుగా "మరియు" అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తే మంచిది. జీవితంలో ఎల్లప్పుడూ అసాధ్యం అనే పదాన్ని వాడకూడదు. ఒక పని అవుతుందో లేదో తెలియని సమయంలో అసాధ్యం అనే పదాన్ని వాడితే నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. "ప్రయత్నిస్తా" అనే పదం కూడా మనకు మంచి కంటే చెడు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 
 
ఎవరైనా ప్రయత్నిస్తా అని చెబుతున్నారంటే ఒక రకంగా వారిపై వారికే నమ్మకం లేదని అర్థమవుతుంది. జీవితంలో చాలా మంది తమకేదైనా నష్టం జరిగితే "అంతా వారి వల్లే" అని చెబుతూ ఉంటారు. ఇతరులపై ఆరోపణలు చేయకుండా చేపట్టిన ఏ పనిలోనైనా ఓడిపోతే ఓటమికి పూర్తి బాధ్యత తీసుకోవడం వల్ల విజేతలుగా నిలవడం సాధ్యమవుతుంది. ఎవరైనా అవతలి వ్యక్తి ప్రశంసిస్తే "అంత సీన్ లేదు" అని చాలా మంది చెబుతూ ఉంటారు. అలా చెప్పామంటే మనల్ని మనం తక్కువ చేసుకుంటున్నామని గుర్తుంచుకోవాలి. ఈ ఐదు పదాలకు ఎంత దూరంగా ఉంటే విజయానికి అంత దగ్గరవుతాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: