జీవితంలో మనము ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఎప్పుడూ దుఃఖానికి లోను కాకూడదు. ఒకవేళ కష్టం వచ్చినా ఎవరితో అయినా పంచుకోవాలి. మీరు ఒక విద్యార్థి అనుకోండి మీ స్నేహితునితో పంచుకోవాలి. లేదా మీరు యువకులైతే మీ తండ్రితో పంచుకోవాలి లేదా ఫ్రెండ్స్ తో అయినా షేర్ చేసుకోవచ్చు. మీకు వివాహము కనుక అయి ఉంటే మీ జీవిత భాగస్వామితో పంచుకోవాలి. అప్పుడు మీకు ప్రశాంతంగా ఉంటుంది. అంతే కానీ కష్టం వచ్చింది కదా అని 24 గంటలు దాని గురించే ఆలోచిస్తూ ఇంటరిగా ఉన్నారనుకోండి, చాలా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మధ్య వయస్కులు ఇలా ఒంటరిగా ఉండకూడదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఒంటరిగా ఉన్నప్పుడు ఆందోళన ఎక్కువవుతుంది. అంతే కాకుండా ఇది మనిషిని కుంగదీస్తుంది. ఇటువంటి వారిలో ఎక్కువగా క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని చెబుతున్నారు. కాబట్టి మీరు ఒంటరితనాన్ని వీడడం చాలా ప్రధానం. ఇది చాలా ప్రమాదకరమైనది. ఒంటరి తనం అంటే మీరు పొగతాగడంతో సమానంగా చెబుతున్నారు. పొగతాగడం ఎలా అయితే మన ఆరోగ్యానికి హాని కలిగిస్తుందో అదే విధంగా ఒంటరితనం కూడా మనపై ఈ దుష్ప్రభావాన్ని చూపుతుంది.  ఈ ఒంటరితనం నుండి బయటపడాలంటే మీరు కొన్ని కొత్త కొత్త అలవాట్లను అలవర్చుకోవాలి. రోజూ ఏదైనా ఒక బుక్ ను కొంతసేపు చదవడం అలవాటు చేసుకోండి.

తద్వారా మీ మనసులో మీ గురించి కాకుండా వేరొకరి గురించి మీకు తెలియకుండానే ఆలోచించడం మొదలు పెడతారు. ఒక రోజులో ఏదో ఒక సమయంలో కొంత సేపు వ్యాయామం చేయండి. ఇది మీకు శరీరకంగానే కాక మానసికంగానూ మంచి ఉల్లాసం మరియు ఉత్సాహాన్ని కలిగిస్తుంది. మీకు నచ్చిన టీవీ షోలను చూస్తూ ఎంజాయ్ చేయండి. ఇలా మీకు నచ్చిన కొన్ని పనులను చేస్తూ ఉండడం వలన ఆటోమేటిక్ గా మీరు ఒంటరి తనాన్ని మెల్ల మెల్లగా వదిలి సాధారణంగా మారిపోతారు. తద్వారా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: