నేడు రాఖీ పౌర్ణమి రోజున సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సకల సంపదలతో సంతోషంగా ఉండాలని, ఆ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ వారికి రక్షగా ఉండాలని ఆకాంక్షిస్తూ సోదరి సోదరీమణులు తమ సోదరులకు రాఖీని కడుతారు. ఇది ఎప్పటి నుండో ఆచారంగా వస్తోంది. ఒక అన్నాచెల్లెళ్ల జంట ఒక్కటిగా కలిసి వ్యాపారం చేసి ఎంతో అత్యున్నత స్థాయికి ఎదిగారు. ఆ విషయాలు ఇప్పుడు మనము తెలుసుకుందాము. మనసులో ఎన్నో ఆలోచనలు ఉన్నా అన్నీ కార్యరూపం దాల్చలేవని తెలిసిందే. అందుకే వీరిద్దరూ ఒక కొత్త ఆలోచనతో ఒక స్టార్టప్ ను ప్రారంభించారు. ముంబైకి చెందిన ఆయుష్ మరియు ఆంచల్ పొద్దార్ అనే ఇద్దరు అన్నాచెల్లెళ్లు కలసి వారు సేవ్ చేసుకున్నటువంటి డబ్బుతో స్టార్టప్ ను ప్రారంభించి ఎంతో సాహసం చేశారునై చెప్పాలి.

ఆ విధంగా వీరు 2015 వ సంవత్సరంలో 10 లక్షల రూపాయలతో  ది మెస్సి కార్నర్ ను స్టార్ట్ చేశారు. మనకు ఎప్పుడూ మన సంప్రదాయాలను బట్టి ఏదో ఒక అకేషన్ జరుగుతూ ఉంటుంది. ఇలా సీజన్ కి తగినట్లుగా బహుమతులు దొరికే విధంగా వీరు షాప్ ను మలచుకున్నారు. మెల్ల మెల్లగా లైఫ్ స్టైల్ వస్తువులను సైతం అమ్మడం స్టార్ట్ చేశారు. ఇప్పుడది లాభాలలో కొనసాగుతోంది. మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ పోను పోను లాభాలు రావడం ప్రారంభం అయింది. ఇప్పుడు వేల ఆదాయం నుండి కోట్ల ఆదాయం సంపాదించే స్థాయికి ఆ కంపెనీని కష్టపడి పైకి తీసుకొచ్చారు ఆ అన్నా చెల్లెళ్ళు.

సరికొత్త ఐడియాలజీ తో స్టార్టప్ ను మొదలు పెట్టిన వీరు అనతికాలంలోనే అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. గత రెండు సంవత్సరాలలో కరోనా మహమ్మారి మాన్ దేశాన్ని ఎంతగా ఇబ్బంది పెట్టిందో తెలిసిందే. ఈ సమాయంలోనూ వీరు కారొనకు సంబంధించిన వస్తువులను, అంటే మాస్కులు, శానిటైజర్, హ్యాండ్ వాష్ లిక్విడ్స్ ఇలా పలు రకాలుగా విక్రయించడం మొదలు పెట్టారు. అది కూడా బాగా క్లిక్ అయింది.  ఈ కంపెనీలో లభించే వస్తువుల ధరలు రూ. 299 నుండి రూ. 3,999 వరకు ఉన్నాయి. మీరు ముంబై లో ఉంటె ఒకసారి ఈ కంపెనీని సందర్శించండి. స్టార్టప్ చేయాలనుకునే వారికి వీరి సలహాలు నచ్చవచ్చు. దేనికైనా నమ్మకం మరియు స్వయంకృషి ఉంటే ఏ రంగంలో అయినా ఇట్టే సక్సెస్ కాగలము.

మరింత సమాచారం తెలుసుకోండి: