విజయం అనేది ఏ ఒక్కరి సొంతము కాదు. సమాజం లోని ప్రతి ఒక్కరూ తాము విజయాన్ని అందుకోవాలి అనే అనుకుంటారు. కాకపోతే ఇక్కడ అనుకోవటం వేరు విజయాన్ని అందుకుని సొంతం చేసుకోవటం కూడా వేరు. కేవలం అనుకుంటే సరిపోదు దీని కోసం వారు చాలా కష్టపడాల్సి వస్తుంది.

విజయాన్ని అందుకోవటానికి ఎదుటి వ్యక్తులని వారు  ఆదర్శంగా తీసుకుని వాళ్ళలా మనం కూడా గొప్పగా ఎదగాలి, అనుకున్న పనిలో విజయాన్ని సాధించాలి అనుకునే వారు చాలా మందే ఉంటారు. వారిలో కొంత మంది మాత్రమే తాము అనుకున్నది సంకల్పం తో సాధించ గలుగుతారు.  తాము  విజయాన్ని అందుకోవటం కోసం వారు ముందుగా తగిన మార్గాన్ని ఎంచుకుంటారు. అనుకున్న పనిని సాధించటం కోసం తాము ఆత్మ విశ్వాసంతో తమకు ఏదురైనటు వంటి ఎంతటి కష్టం అయిన పనులను కూడా తాము  ఎదుర్కోవటానికి సిద్దం అవుతారు. అలాగే వాటిని అధిగమించి తమ యొక్క కృషితో తాము అనుకున్న దానిలో విజయాన్ని కచ్ఛితంగా సాధించి తీరుతారు. అంతే తప్ప ఏదో కాస్తో కూస్తో లేదా ఒకటి రెండు సార్లు అలా తమ ప్రయత్నాన్ని చేసి తాము అనుకున్న పనిని చేరుకోలేక పోయాము. ఇక మనం ఎంత ప్రయత్నం చేసినా వృధా ,విజయాన్ని చేరుకోలేము అని ఆగిపోతే ఎప్పటికీ మనం అనుకున్న పనిలో ముందుకు పోలేము. అలాగే మనం అనుకున్న పనిలో విజయాన్ని సాధించలేము.

అందుకని ఎప్పుడైనా సరే ఏదైనా ఒక పనిని తాము  అనుకుని దానిలో విజయం సాధించాలి అని అనుకుంటే మాత్రం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా, తాము  ఆ పనిని వదిలేసి, వెనుకడుగు వేయకుండా మన లక్ష్యంతో పని చేసినట్లయితే మీరు అనుకున్నది సాధిస్తారు.చూశారు కదా విజయం సాధించాలి అనుకోవటం చాలా సులువు,అదే విజయాన్ని సాధించాలి అని అనుకుని ఎంత కష్టం వచ్చిన ముందుకు సాగాలి అనే కృషి తో ఉన్నట్లయితే విజయాన్ని సాధించటం కూడా చాలా తేలికనే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: