కీమా : 1 కిలో ఉప్పు : సరిపడా పచ్చిమిర్చి : రెండు స్పూన్లు  మిరియాలపొడి : అరస్పూన్ పచ్చిబొప్పాయి : చిన్న ముక్క  క్రీమ్ : 50 గ్రా. లు పెరుగు : 100గ్రా. యాలకులు : ఒక స్పూను గుడ్లు : రెండు తయారుచేయు విధానం : మటన్ ని బాగా కడిగి శుభ్రం చేసుకుని ఖైమా కొట్టించాలి. అందులో పచ్చి బొప్పాయి రసం, యాలకుల పొడి కలిపి నానబెట్టాలి. చీజ్ను మెత్తగా ముద్దలా వేసి అందులో పెరుగు క్రీము, మిరియాల పొడి, పచ్చిమిర్చి ముద్ద మొత్తం కైమాలో మిక్స్ చేసి బాగా కలపండి. అది ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని, ఆ ముద్దను తండూరి చువ్వలచుట్టూ సీక్ కబాబ్ మాదిరిగా అంటించి తండూరిలో గాని, వేడి నిప్పుల మీదగానీ ఉడికించండి. గుడ్డులోని తెల్లని సొనను చలిక్కొట్టి దాన్ని కబాబ్లకు అంటించి మళ్లీ తండూరిలో ఉంచండి. బాగా ఉడికించిన తరువాత పుల్లల నుండి కబాబ్లను బయటకు తీసి ముక్కలుగా కోసుకుని గ్రీన్ సలాడ్ లో తినేవచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: