సోయా మంచూరియా.. పేరు వినడం ఫస్ట్ టైమ్ కదా.. సోయా మంచూరియా ఎంతో రుచికరంగా ఉంటుంది.. అలాంటి ఈ రుచికరమైన సోయా మంచూరియాను ఎలా చేసుకోవాలో మీకు తెలుసా? అసలు సొయా బీన్స్ వల్ల ఎన్ని లాభాలో తెలుసా? సొయా బీన్స్ అందాన్ని పెంచుతుంది.. ఆరోగ్యాన్ని ఇస్తుంది.. అందుకే సొయా బీన్స్ వంటకాలు ఎక్కువగా తింటూ ఉండాలి. అయితే ఇప్పుడు సోయా మంచూరియా ఎలా చేసుకోవాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

కావలసిన పదార్థాలు.. 

 

మీల్‌మేకర్‌ - ఒక కప్పు, 

 

అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను, 

 

కార్న్‌ఫ్లోర్‌ - 3 టేబుల్‌ స్పూన్లు, 

 

మైదా - 2 టేబుల్‌ స్పూన్లు, 

 

కశ్మీర్‌ కారం - ఒక టీ స్పూను, 

 

ఉప్పు - రుచికి తగినంత, 

 

నూనె -  సరిపడేంత

 

వెల్లుల్లి తరుగు - అర టీ స్పూను, 

 

ఉల్లి తరుగు - 3 టేబుల్‌ స్పూన్లు, 

 

ఉల్లి కాడల తరుగు - 4 టేబుల్‌ స్పూన్లు, 

 

క్యాప్సికం తరుగు - అరకప్పు, 

 

చిల్లీ సాస్‌ - ఒక టేబుల్‌ స్పూను, 

 

వెనిగర్‌ - ఒక టేబుల్‌ స్పూను, 

 

టమోటా సాస్‌ - 2 టేబుల్‌ స్పూన్లు, 

 

సోయా సాస్‌ - ఒక టేబుల్‌ స్పూను, 

 

ఉప్పు - రుచికి సరిపడా.

 

తయారీ విధానం... 

 

వేడి నీటిలో మీల్‌ మేకర్‌ని 20 నిమిషాలు నానబెట్టి పిండిని బరకగా రుబ్బాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, మైదా, కార్న్‌ఫ్లోర్‌, కారం, ఉప్పుతో పాటు కొద్దిగా నీరుపోసి ముద్దగా చేయాలి. ఆతర్వాత చిన్న ఉండలుగా చేసి నూనెలో దోరగా వేగించి పక్కనుంచాలి. మరో కడాయిలో 3 టేబుల్‌ స్పూన్ల నూనె వేసి వెల్లుల్లి, ఉల్లి, ఉల్లి కాడల తరుగు, క్యాప్సికం వేగించాలి. తర్వాత చిల్లీసాస్‌, వెనిగర్‌, సోయాసాస్‌, టమోటా సాస్‌, ఉప్పు వేసి మరికొద్దిసేపు వేగించి మంట పెంచి సోయా ఉండలు వేసి బాగా కలపాలి. అంతే.. సోయా మంచూరియా రెడీ.. సాయింత్రం స్నాక్ ల చాలా బాగుంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: