అమ్మ అన్నది ఒక కమ్మని మాట .ఎన్నెన్నో జ్ఞాపకాలు దాగిన  మమతల మూట. దేవుడే లేడనే  మనిషున్నాడు కానీ  అమ్మ లేదనే వాడు అసలు ఎవ్వరు లేరు . మన అమ్మ దేవుడు పంపిన ఒక  దైవం. అమ్మ అనే కమ్మని మాట లోనే వుంది అమృతం.అమ్మ అన్న పిలుపులోనే ఉంది మాధుర్యం. ఎక్కడయినా చెడ్డ తండ్రి ఉంటాడేమో గాని చెడ్డ అమ్మ మాత్రం ఉండదు. మనల్ని ఎంతో ఓర్పుతో  పెంచుతుంది.  అందుకే  అలుపెరగని ఓర్పు అమ్మ .

 

అపురూపమైన కావ్యం అమ్మ .ప్రేమని,మాధుర్యాన్ని నింపిన ప్రేమ ఉందంటే అది  ఒక్క  అమ్మ ప్రేమ మాత్రమే.అమ్మ మాటలో ఉన్న మాధుర్యం మరి ఇంకెక్కడా దొరకదు.అమ్మ మన ఇష్టాలని ఆనందాల్ని తన ఇష్టాలుగా తన ఆనందాలుగా మార్చుకొనేది అమ్మ మాత్రమే. మనకు ప్రేమను పంచి, లాలించి బుజ్జగించి మనకు అన్నం పెట్టె అమ్మకు ఏమి ఇచ్చిన తక్కువే, ఎంత చేసిన తక్కువే.

 

స్వార్ధం అంటే తెలియక గుప్పెడు గుండెలో ఆకాశమంత ప్రేమను మాత్రమే దాచేది, పంచేది అమ్మే కదా..!మనకి కష్టమొస్తే తాను  కన్నీరు కారుస్తుంది. మన కేరింత చూసి తన మనసు పులకించిపోతుంది.మనం అమ్మని కంట నీరు పెట్టించినా ఎంత  వేదన మిగిల్చిన  మన కష్టంలో వేలు పట్టి వెన్ను తట్టి ఓదార్చేది అమ్మ. మన విజయాల్ని  చూసి  మనల్ని మించి సంబర పడి పండగ చేసుకునేది అమ్మ ప్రేమ. 

 

ఆడ జన్మకి గర్వ కారణం అమ్మ ….అమ్మ గురించి ఎంత చెప్పిన తక్కువే అమ్మ గురించి ఎంత చేసిన స్వల్పమే. అమ్మను ఎంత తలిచిన మధురమే.! అలాంటి అమ్మకు ప్రేమను పంచుదాం. అమ్మ రుణాన్ని తీర్చుకుందాం..!!

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: