బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర ఈ మధ్యకాలంలో తీవ్ర శ్వాస సంబంధిత సమస్యలతో హాస్పిటల్ లో చేరిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఆయన బతికుండగానే చనిపోయినట్టు మీడియా వార్తలు రాయడంతో హేమ మాలిని ఆమె కూతురు ఇద్దరు ఫైర్ అయ్యారు. ధర్మేంద్ర పూర్తి ఆరోగ్యంతో తిరిగి కోలుకున్నారు. ఇంటికి కూడా వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ధర్మేంద్ర గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో ఒక విషయం ఏమిటంటే.. ధర్మేంద్ర హేమమాలిన పెళ్లి.. అయితే ధర్మేంద్రకి అప్పటికే ప్రకాష్ కౌర్ తో పెళ్ళై నలుగురు పిల్లలు ఉన్నా కూడా ధర్మేంద్ర మళ్ళీ హేమమాలినితో ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకున్నారు. అలా హేమమాలిని ధర్మేంద్రకు రెండో భార్యగా వెళ్ళింది. 

అయితే బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ గా పేరు తెచ్చుకున్న హేమమాలిని రెండో పెళ్లి వాడిని ఎందుకు చేసుకుంది అని అప్పట్లో ఆమె అభిమానులు అందరూ ఆశ్చర్యపోయారు. అయితే అప్పట్లో హేమమాలినిని ధర్మేంద్ర తో పాటు మరో నటుడు కూడా ప్రేమించారట.అలా ఆ హీరోకి భార్య కావాల్సిన హేమమాలిని చివరికి ధర్మేంద్రని పెళ్లాడింది. మరి ఇంతకీ హేమమాలినిని ప్రేమించిన ఆ నటుడు ఎవరయ్యా అంటే రాజ్ కుమార్.. హేమ మాలిని రాజ్ కుమార్ కలిసి ఎన్నో సినిమాలు చేశారు. అలా వీరి కాంబోలో సినిమాలు వచ్చిన సమయంలో హేమమాలిని ప్రేమలో రాజ్ కుమార్ పడిపోయారు.. అలా లాల్ పత్తర్ మూవీలో నటించిన సమయంలో హేమమాలినిని ప్రేమిస్తున్నట్టు రాజ్ కుమార్ తెలియజేశారట.

 కానీ హేమమాలిని మాత్రం రాజ్ కుమార్ ని ప్రేమించలేదు. అలా రాజ్ కుమార్ ప్రేమ వన్ సైడ్ లవ్ గానే మిగిలిపోయింది. అలా సినిమాల్లో నటించిన సమయంలో రాజ్ కుమార్ కొంతమందితో ప్రేమలో పడి చివరికి ఏది సఫలం కాకపోవడంతో ఆంగ్లో ఇండియన్ ఎయిర్ హోస్టెస్ అయినటువంటి జెన్నీ ఫర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలా ఈ జంటకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అలా హేమమాలిని రాజ్ కుమార్ప్రేమ కథ రియల్ లైఫ్ లో సక్సెస్ కాకపోయినప్పటికీ బాలీవుడ్ చరిత్రలో మాత్రం ఇది ఒక ఇంట్రెస్టింగ్ అధ్యయంగా మిగిలిపోయింది. అలా విధి ఆడిన వింత నాటకంలో రాజ్ కుమార్ జెన్నీఫర్ ని..హేమమాలిని ధర్మేంద్రని పెళ్లి చేసుకొని వైవాహిక బంధం లో సెటిల్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: